మహిళా సాధికారితకు ప్రభుత్వం వేల కోట్లు వెచ్చిస్తోంది (mahila sadhikarithaku prabhuthvam veela kottulu veechisuthundhi)

గిరిజన మహిళ సాధికారిత కోసం గిరిజన కళ్యాణ పథకం—
ఎపి మహిళా సహకార ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మేఘలాదేవి—
కొయ్యలగూడెం, (పశ్చిమ గోదావరి జిల్లా) : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గడిచిన మూడు సంవత్సరాల కాలంలో మహిళ అభివృద్ధి, సంక్షేమం కోసం, బాలికాలు విద్యకోసం, వారి సాధికారిత కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టి అమలు పరుస్తూ వేల కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తోందని ఎపి మహిళా కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు గంగిరెడ్ల మేఘలాదేవి పేర్కొన్నారు. కొయ్యలగూడెంలోని తన స్వగృహంలో మంగళవారం మధ్యాహ్నం ఆమె విలేఖరుతో మాట్లాడారు. మహిళలు తమ సమస్యలు తామే పరిష్క రించుకోవటానికి జాతీయ మహిళా సాధికారిత సదస్సును విజయ వాడలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందని ఆమె గుర్తు చేసారు. గిరిజన మహిళ సాధికారితకోసం సిఎం చంద్రబాబు నాయుడు గిరిజన కళ్యాణ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ పథకంలో 18 సంవత్సరాల వయసు నిండిన గిరిజన యువతులకు వివాహం సందర్భంగా 2015-16 సంవత్సరంలో 1017 మందికి, 2016-17లో 1198 మందికి ఒక్కొక్కరికి రూ. 50 వేలు వంతున ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం అందించినట్లు ఆమె పేర్కొన్నారు. ముస్లిం యువతులకు వారి వివాహం సందర్భంగా దుల్హాన్‌ పథకం ద్వారా గడిచిన రెండేళ్లలో ఒక్కొక్కరికి రూ 50 వేల వంతున 11,005 మందికి రూ 55 కోట్లు మంజూరు చేసి అందజేసినట్లు ఆమె వివరించారు. కాంగ్రెస్‌ నేత పదేళ్ల పాలనలో డ్వాక్రా సంఘాలకు రూ 40,877 కోట్లల రుణాలుగా ఇవ్వగా, తెలుగుదేశం ప్రభుత్వం గడిచిన మూడేళ్లలోనే రూ 28,331 కోట్లలు రుణాలుగా అందించిందని ఆమె అన్నారు. మహిళ కోరికపైనే మద్యం గొలుసు దుకాణాలను ప్రభుత్వం తొలగించి, మద్యం అమ్మకాలపై నియంత్రణ విధించిందని అన్నారు. మహిళలకు రక్షణ కల్పించడానికి మహిళా పోలీసుస్టేషన్‌లు, యాంటీ ర్యాగింగ్‌ టీమ్‌లను మహిళా యాప్‌లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. 13 వేల మంది డ్వాక్రా స్వయం సహాయక సంఘ సభ్యులను పశుమిత్రుగా నియమించి వారికి నెలకు ఒక్కొక్కరికి రూ 2500 వేతనం చెల్లిస్తోందన్నారు. శిశు మరణాలు, మాతృ మరణాలు తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన పథకాలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. బాలింతలు, గర్భిణీలకు చిన్నారుతోను పౌష్టికాహారం లోపం నివారించేందుకు అన్నఅమృత హస్తం పథకం ద్వారా 8.56 లక్ష మంది గర్భిణీ, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారని చెప్పారు. 6 నెల నుంచి 6 సంవత్సరాల లోపు వయసు గల గిరిజనుల పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారించేందుకు ప్రభుత్వం అమలు పరుస్తున్న గిరిగోరు మద్దల పథకం ద్వారా 1,34,733 మంది ప్రయోజనం పొందుతున్నారన్నారు. బాలికా విద్యను ప్రొత్సహించటానికి బడికి వస్తా పథకం ద్వారా 1,80,033 మంది 9వ తరగతి బాలికలకు సైకిళ్లు పంపిణీ జరుగుతుందన్నారు. మహిళాభివృద్ధి సంక్షేమమే తెలుగుదేశం ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తోందని మేఘలాదేవి పేర్కొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *