రజకులను ప్రభుత్వం మోసం చేసింది

గోపాలపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం రజకులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయలేదని నమ్మిన రజకులను ప్రభుత్వం నిట్టనిలవునా మోసం చేసిందని రజక సంఘం జిల్లా అధ్యక్షులు చిలకపల్లి కట్లయ్య అన్నారు. మండలంలోని వేళ్ళచింతగూడెంలో కె నాగయ్య అధ్యక్షతన మంగళవారం జిల్లా రజక సంఘం సభ్యులుతో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిదిగా పాల్గొన్న కట్లయ్య మాట్లాడుతూ గడచిన మూడేళ్ళ కాలంలో ప్రభుత్వం రజకులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటికీ కూడా అమలు చేయలేదన్నారు. రజకుల సమస్యలను పట్టించుకున్న నాధుడే కరువైయ్యాడని చంద్రబాబు నాయుడు అబద్దాలకు రజకులు పూర్తిగా మోసపోయారని అన్నారు. జిల్లాలో ఉన్న రూ. 2 లక్ష 20 వేల మంది రజకులు వచ్చే ఎన్నికల్లో రజకుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తారో వారికి మా మద్దతు ఉంటుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ్ళ తెరిచి మా కులానికి జరుగుతున్న అన్యాయంపై పెదవి విప్పాలని డిమాండ్‌ చేసారు. లేకపోతే ప్రభుత్వం పై వ్యతిరేక ఉద్యమానికి సిద్ధం కావాలని రజక సోదరులకు పిలుపునిచ్చారు. రజకులకు అందాల్సిన రుణాలు, చెరువు, విశ్రాంతి భవనాల నిర్మాణాలు ఎప్పటికి పూర్తి చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీసారు. ఎప్పటికప్పుడు కల్లబొల్లి మాటలు చెప్పి తప్పించుకోవాలని చూస్తే మాత్రం ఎదురుదాడి తప్పదన్నారు. అనంతరం ఆక్రమణలకు గురైన చెరువులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సిహెచ్‌ దుర్గారావు, జి మూర్తి, ఎం మురళీకృష్ణ, సరికొండ వీర్రాజు మండల రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *