సంక్షేమ హాస్టళ్ళు మూసివేతకు నిరసనగా బంద్‌

ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు ఖండెల్లి శివ——
గోపాలపురం, (పశ్చిమ గోదావరి జిల్లా) : సంక్షేమ హాస్టళ్ళు మూసివేతకు నిరసనగా ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్ధలు బంద్‌కు వామపక్ష విద్యార్ధి సంఘాలు పిలుపునిచ్చినట్లు ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు ఖండెల్లి శివ అన్నారు. స్ధానిక బీసీ హాస్టల్‌ వద్ద మంగళవారం నాయకు ముప్పిడి నవీన్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న శివ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, బీసీ, ఎస్‌టి సంక్షేమ హాస్టళ్ళును మూసివేతకు నిరసనగా విద్యాహక్కును చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ ఈ నెల 10న బంద్‌కు పిలుపునివ్వడం జరిగిందన్నారు. జిల్లాలో దాదాపు 100 హాస్టళ్ళు సొంత భవనాలు లేక ఇరుకు గదులో మగ్గుతున్నారన్నారు. సంక్షేమ హాస్టళ్ళులో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేసారు. విద్యార్ధులకు ఇచ్చే మెస్‌ చార్జీలు కన్నా జైలు ఖైదీకు ఇచ్చే మెస్‌ చార్జీలు ఎక్కువగా ఉన్నాయని ఈ దేశ భవిష్యత్తు విద్యార్ధుల చేతుల్లో ఉందని ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని ద్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో కె దుర్గాసాయి, జి హేమంత్‌సాయి, ఉమాశంకర్‌, జగదీష్‌, మురళీ, ప్రవీణ్‌, వినోద్‌ పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *