జాలిపూడి డ్రైను పరిశీలిస్తున్న వివేకానంద ప్రజాపరిరక్షణ కమిటీ

ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా) : ఏలూరు నగరంలోని 43, 46, 47, 48, 2 డివిజన్లలో గల జాలిపూడి డ్రయిన్ను బుధవారం శ్రీ స్వామి వివేకానంద ప్రజాపరిరక్షణ కమిటీ అధ్యక్షులు కోలాభాస్కరరావు, ఉపాధ్యక్షులు నండూరు శ్రీనివాసరావు, కార్యదర్శి యెల్లపు మురళి, సభ్యులు గంట జోగిరాజు, ధనియాల ఈశ్వర్, హంసాల సత్యనారాయణ,శెట్టి వెంకన్న, అర్జీ సురేష్ లు సందర్శించి పరిశీలించారు.డ్రయిన్ కు ఇరువైపులా గోడ లేక మట్టి తోడుకుపోయి మురుగునీరు పారుదల లేక ఈ డ్రయిను పరిసరాలలో నివసిస్తున్న గృహస్థులు అనేక రోగాల బారిన పడుతున్నారు. దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నారు. పందులకు ఆవాసంగా మారడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.వర్షాకాలం కావడంతో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైయ్యిందని గృహస్థులు వాపోతున్నారు. సి.ఎస్.ఐ.ఈ. స్కూల్ వద్ద డ్రయిను ఇరుప్రక్కల మొక్కలు పెరిగి చిట్టడవిని తలపించేలా మురుగు ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. నగరపాలక సంస్థ అధికారులు తక్షణం స్పందించి జాలిపూడి డ్రయిను ప్రక్షాళన చేసి, డ్రయినుపై ఆక్రమణలు తొలగించాలని వివేకానంద ప్రజాపరిరక్షణ సమితి అధ్యక్షుడు కోలాభాస్కరరావు డిమాండు చేశారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *