తాళం వేసివున్న ఇంటిపై పోలీసు నిఘా

ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా) : జిల్లా ఎస్‌పి ఎమ్. రవి ప్రకాష్ ఐ‌పి‌ఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం లాక్ద్ హౌస్ మానిటరింగ్ సిస్టం జిల్లాలో ప్రారంభించబడుచున్నది ఈ విధానం లో నోడెల్ ఆఫీసర్ గా జిల్లా అదనపు ఎస్‌పి వి. రత్న వ్యవహరిస్తారు ఈ విధానంలో రాత్రి వేళల్లో తాళం వేశివున్న ఇంటి పై పోలీసు వారి యొక్క గట్టి నిఘా ను డి‌ఎస్‌పి సి‌సి‌ఎస్ వారు ప్రత్యేక పర్యవేక్షణలో జరుగుతుంది. లాక్ద్ హౌస్ మానిటరింగ్ సిస్టం ఎలా పని చేస్తుందంటే. లాక్ద్ హౌస్ మానిటరింగ్ సిస్టం యాప్ ను మొదట ఆంధ్రాయిడ్ సెల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది 1.౩ ఎంబి ఉంటుంది. యాప్లోకి వెళ్లి మీ వివరాలు, చిరునామా, సెల్ నెంబరు వివరాలకు సంభందించిన దరఖాస్తును భర్తీ చేస్తే ఆమొదిస్తూ రిజిస్ట్రేషన్ యూనిక్ ఐధీ ఇస్తారు. ఎప్పుడైనా ఇంటికి తాళం వేసి వెల్తునట్లయితే యాప్ లోని రిక్వెస్ట్ వాచ్ లో ఫలానా రోజు నుంచి ఫలానా రోజు వరకు ఇంటికి తాళం వేసి వెళ్తునట్లు వివరాలు పేర్కొనాలి. స్ధానిక పోలీస్ స్టేషన్ పోలీసులు ఇంటికి వచ్చి వైర్లెస్ మోషన్ కెమరా (కెమెరా ముందు కదిలికలు కనిపిస్తే రికార్డ్ చేసే కెమరా) ను మోడం (వైఫై) ను ఏర్పాటు చేస్తారు. వైర్లెస్ మోషన్ కెమరా యూపియస్ విద్యుత్ కు అంతరాయం ఏర్పడిన సందర్బాలలో ఆరు గంటల పాటు పనిచేసే బ్యాటరీ ఉంటుంది. దొంగలు విధ్యుతుకు అంతరాయం కలిగించినా బ్యాటరీ సహాయంతో పనిచేస్తుంది. ఇది పోలీసు కంట్రోల్ రూమ్ కు అనుసంధానిస్తారు. కెమెరా ముందు ఏవైనా కదిలికలు జరిగితే వెంటనే ఫోటోలు, వీడియోను రికార్డ్ చేసి కంట్రోల్ రూమ్ కు చేరవేయటం తో పాటు అలారం శభ్దాన్ని ఇస్తుంది. కావాలనుకుంటే ఇంటి యజమానులకు ఫోటోలు, వీడియోలు పంపే సౌకర్యం ఉంది. దొంగలు చొరబడిన సందర్బాలలో ఈ కెమెరా కంట బడితే, కెమెరా లో ఉండే సెన్సార్లు ద్వారా, కంట్రోల్ రూమ్ లో ఉండే సి. సి. కెమెరా లలో దొంగ యొక్క ఫోటోలు వీడియో లను కంట్రోల్ రూమ్ లోని సిబ్బందికి పంపుతూ అలారం ఇస్తుంది. సిబ్బంది వెంటనే స్తానిక గస్తీలో ఉండే పోలీసులను అలెర్ట్ చేసి ఇంటి వద్దకు పంపుతారు. ఇలా దొంగను పట్టుకునే అవకాశం ఉంది. ఆంధ్రాయిడ్ మొబైల్ లోని గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లి ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంటి అడ్రస్సుతో పాటు సెల్ నెంబర్ పొందుపరచి మీరు ఉన్న ఇంటి నుంచే యాఫ్ ను రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకొన్న తర్వాత ఓ టి పి నెంబరు తో యూజర్ ఐడి వస్తుంది. ఎప్పుడైనా ఊర్లకు, యాత్రలకు వెళ్లి నప్పుడు ఈ యూజర్ ఐడి తో యాప్ లోని పోలీసు రిక్వెస్ట్ వాచ్ ద్వారా సమాచారం ఇవ్వాలి. ఫలానా రోజుల్లో ఇంట్లో ఉండమని పోలీసులకు సమాచారం ఇవ్వాలి. దీంతో పోలీసులు మీ ఇంటికి వైఫై కెమెరా మోడం అతికించి వెళ్తారు. అప్పటి నుంచి మీరు వచ్చే వరకు మీ ఇల్లు పోలీసు నిఘా లో ఉంటుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *