దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలి

దళిత క్రైస్తవులపై వివక్ష చూపుతూ చులకనగా చూస్తున్నారు
దళిత క్రైస్తవులను దేశంలోని అందరితో సమానంగా చూడలి
ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా): భారతదేశంలో దళిత క్రైస్తవులపై వివక్షత చూపుతూ చులకనగా చూస్తున్నారని క్రైస్తవ సంఘాల నాయకులు ఆరోపించారు. దళిత క్రైస్తవులను దేశంలోని అందరితో సమానంగా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం దళిత క్రైస్తవులు బ్లాక్‌ డే పాటించారు. ఈ సందర్భంగా నగరంలో వేలాది మంది క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు. వీరందరూ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయులు­ ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ దళిత క్రైస్తవుల్లో 90 శాతానికి పైకా పేదరికాన్ని అనుభవిస్తున్నారన్నారు. అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. శాంతి యు­తంగా హక్కు కోసం పోరాడుతున్న దళిత క్రైస్తవుల డిమాండ్లను ప్రభుత్వాలు పరిష్కరించాలన్నారు. వారి ఆర్థికాభివృద్ధికి చేయూత అందించాలన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని పాలకులకు ఎమ్మెల్సీ సూచించారు. ఆర్‌సిఎం బిషప్‌ పొలిమేర జయరావు మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న దళిత క్రైస్తవులకు సరైన భద్రత ఉండడం లేదని, చులకనగా చూస్తున్నారన్నారు. 67 సంవత్సరాల భారతదేశంలో ఉన్న క్రైస్తవులను మిగతా వారి కంటే తక్కువగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ కారణంగా ఈ ఏడాది భారతదేశ మేత్రానుల సదస్సు ఈ అన్యాయాలను గుర్తించిందన్నారు. ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమని ప్రభుత్వానికి తెలియజేయడానికే ఈ బ్లాక్‌డేను నిర్వహించామన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని అనేక శాంతియూ­త ఉద్యమాలు తరువాత 1956లో సిక్కుమతం, 1990లో బౌద్ధ మతాన్ని ఎస్సీ జాబితాలో చేర్చారన్నారు. అయితే ముస్లింలు, క్రైస్తవులను చేర్చడం లేదన్నారు. భారతదేశ జనాభాలో 2.3 శాతం దళిత క్రైస్తవులు ఉన్నారన్నారు. వీరందరినీ ప్రభుత్వం గుర్తించి భారతదేశంలోని హిందువులకు ఇస్తున్న గౌరవాన్ని ఇవ్వాలని, అలాగే అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కాటంనేని భాస్కర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐసిఎం బిషప్‌ ఎన్‌జెఎస్‌టి రాజు, బిషప్‌ డాక్టర్‌ కూరపాటి శాంతి సాగర్‌, ఫాదర్‌ బాల, ఫాదర్‌ మోజెస్‌, ఫాదర్‌ నిర్మపతిరాజు, ఫాదర్‌ ఎబినేజర్‌ శాస్త్రి, అబ్రహం మాస్టర్‌, ఫాదర్‌ ఇమ్మానుయేల్‌, సోషల్‌ సర్వీస్‌ సెంటర్‌ ఫాదర్‌ రాజు, ఫాదర్‌ గ్జేవియర్‌, జానంపేట విజ్ఞాన్‌ నిలయం రిజిష్ట్రార్‌ ఫాదర్‌ టి ఆంథోనిస్వామి, విజ్ఞాన నిలయం ప్రొఫెసర్‌ నున్నా అంజారావు, బ్రదర్‌ అవినాశ్‌, బ్రదర్‌ జ్వానేష్‌, బ్రదర్‌ గౌతంలు పాల్గొన్నారు. అనంతరం బిషప్‌ పొలిమేర జయరావు ఆధ్వర్యంలో పలువురు మ­ఖ్య మంత్రి చంద్రబాబు నాయు­డుకు వినతి పత్రం ఇచ్చేందుకు విజయవాడ అమరావతి తరలివెళ్లారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *