పెండింగ్‌ కేసులపై దర్యాప్తు వేగవంతం చేయాలి

ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా): జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులపై దర్యాప్తు వేగవంతం చేయాలని జిల్లా ఎస్‌పి ఎం రవిప్రకాష్‌ అన్నారు. గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జిల్లా క్రైమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ ఎన్‌విడబ్ల్యు కొరకు టీమ్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హైవే మొబైల్స్‌ యొక్క సిబ్బంది చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర చర్యలు తీసుకుని హైవేపై ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను హైవేకు దగ్గరలో ఉన్న హాస్పటల్‌లో జాయిన్‌ చేయాలని, నేర నియంత్రణ కోసం సిబ్బంది అందరూ పని చేయాలని ఆదేశించారు. పెండింగ్‌ ట్రైల్‌లోని ఉన్న కేసులో సాక్షులను కోర్టులో హాజరు పరచి నేరస్తులకు శిక్షలు పడేలా అందరూ ఇన్‌స్పెక్టర్‌ు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చు ఫిర్యాదు దారుల పట్ల రిసెప్సనిస్ట్‌లు, పోలీసు సిబ్బంది మర్యాదగా నడుచుకోవాలని లాక్‌డ్‌ హౌస్‌ మానిటరీ సిస్టం గురించి విస్తృతంగా అపార్ట్‌మెంట్‌ వద్ద, గృహ, వ్యాపార సముదాయాల వద్ద ప్రచారం చేయాలని లాక్‌డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టంపై అందరు ఇన్‌స్పెక్టర్‌ు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ు, ప్రతీరోజు పర్యవేక్షణ ఉండాలని, ప్రతీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ముఖ్య కూడలి వద్ద సిసి కెమేరాలు ఏర్పాటు చేయించి, కంట్రోల్‌ రూమ్‌ ద్వారా అధికారులు పర్యవేక్షణ చేయాలని తద్వారా నేరదర్యాప్తునకు ఉపయోగపడుతుందన్నారు. క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రేడింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌ ద్వారా నేర సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుపరచాలని సూచించారు. నేర సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులు, నేరస్థలానికి వెళ్లాలని, ప్రతీరోజు ప్రతీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అధికారులు సాయంత్రం వేళ యందు విసిబులు పోలీసింగ్‌ చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఎవరైనా క్రికేట్‌ బెట్టింగ్‌, పేకాట, కోడిపందాలు నిర్వహించే వారిపై నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌పి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్‌పి వి రత్న, ఏలూరు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, నర్సాపురం డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలు, ఎస్‌సి ఎస్‌టి సెల్‌ వన్‌డిఎస్‌పి, మహిళా పోలీస్‌స్టేషన్‌ డిఎస్‌పి, ఏలూరు ట్రాఫిక్‌ డిఎస్‌పి, సిసిఎస్‌, ఎస్‌బి డిఎస్‌పి పి బాస్కరరావు, ఇన్‌స్పెక్టర్‌ు, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ు తదితరులు పాల్గొన్నారు. పోలీస్‌స్టేషన్‌ వారీగా కేసు పురోగతిపై ఎస్‌పి వివరణ కోరారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *