ప్రతి విద్యార్ధి వారి లక్ష్య సాధన కోసం శ్రమించాలి

ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా) : ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షల్లో ప్రతి విద్యార్ధి అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులు కావాలనే లక్ష్యంతో విద్యార్ధులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఏలూరు హేలాపురి డైమండ్స్‌ లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు పెద్దిరెడ్డి ప్రదీప్‌ అన్నారు. శనివారపు పేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 120 మంది విద్యార్ధినీ, విద్యార్ధులకు పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో చదువు, వ్రాత, పరిజ్ఞానం, జ్ఞాపకశక్తి, వ్యాకరణలు వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి ప్రదీప్‌ మాట్లాడుతూ పది నెలల సుదీర్ఘంగా పాఠ్య పుస్తకాలు అభ్యసించిన విద్యార్ధులు పరీక్ష సమయంలో కొంత తడబాటుకు గురవుతారన్నారు. దీని నుంచి దూరం చేసేందుకు, చదువుపై మక్కు వ పెరిగేలా శిక్షణా తరగతు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతీ విద్యార్ధికి పదవ తరగతి పరీక్షల్లో మంచి ర్యాంకుతో ఉత్తీర్ణత కావాన్నదే లక్ష్యం కావాలన్నారు. ఆ లక్ష్య సాధన కోసం విద్యార్ధులు శ్రమించాని, పై తరగతులకు పదవ తరగతి పరీక్షలు పునాది వంటివని చెప్పారు. శిక్షకులు, హ్యాండ్‌ రైటింగ్‌ మోటివేటర్‌ వై. మల్లిఖార్జునరావు మాట్లాడుతూ పరీక్షలు రాసే సమయంలో ముందుగా ప్రశ్నా పత్రాన్ని క్షుణ్ణంగా చదవాలన్నారు. ఆ తరువాత ఎన్ని మార్కులకు ప్రశ్న ఇచ్చారో అన్ని మార్కులకు సంబంధించిన జవాబులన్నీ వ్రాయాలన్నారు. అక్షర దోషాలు ఉండకూడదన్నారు. వాక్యం నిర్మాణం ఖచ్చి తంగా ఉండాలన్నారు. అచ్చు తప్పు ఉండకూడదన్నారు. అంతే కాకుండా ఏరోజు వర్కును ఆ రోజు పూర్తి చేయాలన్నారు. రేపు చదువుదాం, రాద్దాం అనే విషయాలకు స్వస్తి చెప్పాలన్నారు. ఫస్ట్‌ ర్యాంక్‌లో ఉత్తీర్ణత కావాలనే లక్ష్యంతో ముందడుగు వేయాలన్నారు. ఆత్మస్థైర్యంతో పరీక్షకు హాజరు కావాలన్నారు. అలాగే అనునిత్యం సమయానికి ఆహారం తీసుకోవాలని, నిద్ర లేకుండా గడపకూడదని చెప్పారు. ప్రతి విద్యార్ధి వారి లక్ష్య సాధన కోసం శ్రమించాలన్నారు. అనంతరం ఏలూరు హేలాపురి డైమండ్స్‌ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్ధినీ విద్యార్ధులందరికీ పర్సనాలిటీ డెవప్‌మెంట్‌ పుస్తకాలను పెద్దిరెడ్డి ప్రదీప్‌ అందజేసారు. క్లబ్‌ ప్రధాన కార్యదర్శి కడియా విజయలక్ష్మీ, జోన్‌ చైర్మన్‌ వడ్లపూడి కృష్ణమోహన్‌, సభ్యులు సురేష్‌ పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *