బంద్‌ పిలుపుతో మూతపడిన విద్యాలయాలు

ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా): విద్యార్ధి సంఘాల ఐక్య కార్యచరణ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్‌ విజయవంతమైనది. నగరం లో ప్రైవేట్‌ విద్యాసంస్థలకు ముందే స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు. నగరంలో ర్యాలీగా తిరుగుతూ భారత విద్యార్ధి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ), ప్రొగ్రెసివ్‌ డెమెక్రటిక్‌ స్టూడెంట్‌ యూనియన్‌ (పిడిఎస్‌యూ) అఖిల భారత విద్యార్ధి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) కార్యకర్తలు తెరిచివున్న విద్యాసంస్థలను మూయించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి కె అనిల్‌ మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన ఏలూరులో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మౌళిక సదుపాయాలు లేవని కనీసం సొంతభవనం కూడా లేని కారణంగా విద్యార్ధులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారని ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది అనడానికి ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమస్యలే నిదర్శనంగా కనబడుతున్నాయని అన్నారు. గత ఐదు సంవత్సరాల క్రితం పెంచిన మెస్‌ఛార్జీలనే నేటికీ అమలు చేస్తున్నారని పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్‌ఛార్జీలు పెంచని కారణంగా అర్ధాకలితో విద్యార్ధులు వారి చదువు కొనసాగించవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌ ఫీజురీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాని ఏర్పాటు చేయాలన్నారు. ఎయిడెడ్‌ కళాశాలను నిర్వీర్యం చేస్తున్న జివో నెంబర్‌ 35ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధి సంఘం నాయకులు అరటకట్ల శరత్‌చంద్ర, చింతా మణికంఠ, శ్రీకాంత్‌, సంతోష్‌, నాని, తబ్బిరాజు, గణేష్‌, ఆదిత్యా, డి సతీష్‌లు పాల్గొన్నారు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *