బాబు మళ్లీ టేప్‌ రికార్డర్‌ ఆన్‌ చేశారు

నంద్యాల: తన మూడేళ్ల పాలనలో ఏఒక్క హామీని నెరవేర్చని సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ టేప్‌ రికార్డర్‌ ఆన్‌ చేశారని, ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోని చంద్రబాబు మళ్లీ అవే పాత హామీలను ఇస్తూ ప్రజలను మోసం చేయడానికి ప్రయ త్నిస్తున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికలలో భాగంగా రెండోరోజు గురువారం చాబ్రోలులో వైఎస్‌ జగన్‌ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అన్నారు. ‘ఇవాళ చంద్రబాబు నాయుడు కేబినెట్‌ మొత్తం నంద్యాల నడిరోడ్డు మీద ఉంది. ఒక్క నంద్యాలోనే వంద కోట్ల అవినీతి సొమ్మును విచ్చవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఒక్క నంద్యాలలోనే హడావిడి అంతా కనిపిస్తోంది. చిన్న, చిన్న నేతను సైతం కొనుగోలు చేస్తున్నారు. అన్ని వర్గాల వారికి ఎరవేస్తున్నారు. ఇందుకు కారణం చంద్రబాబు నాయుడు తన మూడున్నరేళ్ల పాలనలో ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోవడమే. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేకపోవడం.. జరుగుతున్నదంతా అన్యాయం, అవినీతే కావడంతో చంద్రబాబుకు ఈ రోజు ఈ దారుణమైన పరిస్థితి వచ్చింది’ అని అన్నారు. ‘నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు టేప్‌ రికార్డర్‌ ఆన్‌ చేశారు. ఇంతకు ముందు చెప్పిన హామీను మళ్లీ చెప్పి ప్రజలను మోసం చేసేందుకు, మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చిన్నాచితక నేతలను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. చంద్రబాబుకు కళ్లు నెత్తిమీదకు వచ్చే శాయి. డబ్బుతో ఏదైనా చేయొచ్చు అనే భావనతో ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.
నాకున్న ఆస్తి ఇదే..
దివంగత ముఖ్యమంత్రి, నాన్నగారు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చివెళ్లిన ఇంతపెద్ద కుటుంబమే తన ఆస్తి అని ప్రజలను ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ‘చంద్రబాబు మాదిరిగా నా వద్ద సీఎం పదవి లేదు, డబ్బు లేదు, పోలీసు బలం లేదు. చంద్రబాబు మాదిరిగా ఉన్నది లేన్నట్టు లేనిది ఉన్నట్టు చెప్పే టీవీ చానెళ్లు, పేపర్లు నా దగ్గర లేవు. చంద్రబాబు మాదిరిగా నా దగ్గర దుర్బుద్ధి లేదు. చంద్రబాబు మాదిరిగా అధికారం కోసం ఎంతకైనా దిగజారి అబద్ధాలు చెప్పలేను. నాకున్న ఆస్తి ఏమిటో తెలుసు.. దివంగత నేత, నాన్న గారు నాకు ఇచ్చిపోయిన ఇంతపెద్ద కుటుంబమే నా ఆస్తి. నాన్నగారు అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటిలో బతికి ఉండటమే నాకున్న ఆస్తి.. జగన్‌ అబద్ధం ఆడడు, జగన్‌ మోసం చేయడు. జగన్‌ ఏదైతే చెప్తాడో అది కచ్చితంగా చేస్తాడన్న విశ్వసనీయత నాకున్న ఆస్తి. జగన్‌ కూడా వాళ్ల నాన్నగారి మాదిరిగానే ప్లీనరీలో నవరత్నా పథకాలు ప్రకటించాడు. ఆ నవరత్నాతో ప్రతి ఇంటిలో వెలుగునింపుతాడు. వాళ్ల నాన్నగారిలాగే జగన్‌ గొప్పగా పరిపాలన చేస్తాడన్న ప్రజల నమ్మకమే నాకున్న ఆస్తి’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *