మద్దిలో కన్నుల పండుగగా సువర్చలా హనుమత్‌ కళ్యాణము

జంగారెడ్డిగూడెం, (పశ్చిమ గోదావరి జిల్లా) : జంగారెడ్డిగూడెం మండలం, గురవాయిగూడెం గ్రామంలో తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వేంచేసియున్న శ్రీమద్ది ఆంజనేయస్వామి వారికి, సువర్చలా దేవి అమ్మవారికి గురువారం నాడు స్వామివారి జన్మనక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రము వచ్చిన సందర్భంగా ఉదయం 10 గంటలకు సువర్చలా హనుమత్‌ కళ్యాణము కన్నుల పండుగగా జరుపబడింది. ఈ కార్యక్రమం ఆలయ అర్చకులు, వేదపండితులచే ఘనంగా జరుపబడింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అని ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు, ఆలయ ఛైర్మన్‌ యిందుకూరి రంగరాజు, ధర్మకర్త మండలి సభ్యులు తెలిపారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *