మొక్కలు నాటడమే కాదు పరిరక్షణ మన బాధ్యతే

నిడదవోలు, (పశ్చిమ గోదావరి జిల్లా) : స్ధానిక రాంనగర్‌లోని నారాయణ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ విద్యార్ధినీ విద్యార్ధులు నిడదవోలు పట్టణంలోని ముఖ్య ప్రభుత్వ కార్యాయాలు ఆయిన మున్సిపల్‌ కార్యాలయం అగ్ని మాపక అధికారి కార్యాలయం ఆర్‌డిసి డిపోలో ముఖ్య అధికారులచే ఇంటికో మొక్క నినాదంతో మొక్కలను వారి ప్రాంగణాలలో వారిచే మొక్కలను నాటించారు. మొదట పట్టణ మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకృష్ణ మోహన్‌చే మున్సిపల్‌ ఆఫీస్‌ ప్రాంగణంలో మొక్కలు నాటారు. విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణపై కూడా మక్కువ కలిగే విధంగా విద్యార్ధులను చైతన్య పరచడం చాలా మంచి పరిణామం అని మున్సిపల్‌ కమిషనర్‌ అన్నారు. నిడదవోలు పట్టణ అగ్ని మాపక అధికారి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ మొక్కులు అధికంగా నాటుట వలన సమస్త మానవళి విపత్తు నుండి రక్షింపబడవచ్చు అని అన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా అధికారి రామారావు విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్ధులు ఈ విధంగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి అందరిని చైతన్య పరిచే విధంగా పచ్చని చెట్లే ప్రగతికి మెట్లని సంస్ధ ఎజిఎం సీతారాం అన్నారు. మొక్కలను నాటడమే కాదు వాటి పరిరక్షణ కూడా మనందరి బాధ్యత అని ప్రిన్సిపాల్‌ జీవన్‌ విజయ సాగర్‌ అన్నారు. స్కూల్‌ ఎఓ రాంప్రసాద్‌ ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది విద్యార్ధులతో కలసి ప్రభుత్వ కార్యాలయాను సందర్శించారు. కార్యక్రమం అనంతరం నారాయణ విద్యా సంస్ధ సాఫ్ట్‌స్కిల్స్‌ ట్రయినర్స్‌ రాజ్యక్ష్మి, వినోద్‌లు డ్రాయింగ్‌ కంపిటీషన్‌ నిర్వహించి విజేతలను అభినందించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *