హైదరాబాద్‌లో ఘనంగా పరిటాల శ్రీరామ్‌ నిశ్చితార్థం

హైదరాబాద్‌: ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌ నిశ్చితార్థం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. మాదాపుర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో పరిటాల కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలకు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ వేడుకలలో సందడి చేశారు. ఏపీ స్పీకర్‌ కోడె శివప్రసాదరావు, మంత్రు దేవినేని ఉమామహేశ్వరరావు, అయ్యన్న పాత్రుడు, కామినేని శ్రీనివాస్‌, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరితో పాటు అనంతపురం జిల్లా నేతలైన ఎమ్మెల్సీ పయ్యావు కేశవ్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసు, జెడ్పీ చైర్మన్‌ చమన్‌సాబ్‌ హాజరై శ్రీరామ్‌-జ్ఞాన జంటను ఆశీర్వదించారు. శింగనమల నియోజకవర్గం నార్పల మండలం ఏవీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కాంట్రాక్టర్‌ ఆలం వెంకటరమణ, సుశీలమ్మ కుమార్తె ఆలం జ్ఞానతో అక్టోబర్‌ 1న పరిటాల శ్రీరామ్‌ పెళ్లి జరగనుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *