ఒకే టీకాతో ఈ వ్యాధిని నివారించవచ్చు

తల్లిదండ్రులు ఎంత సంపాదించిన పిల్లలు ఆరోగ్యంగా లేకపోతే అన్ని కోల్పోయినట్లె—
1200 మంది విద్యార్ధులకు తట్టు, రుబెల్లా వ్యాక్సిన్‌—
శ్రీ శ్రీ విద్యాసంస్థల అధినేత యమ్‌బి.యస్‌ శర్మ—
ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా) : పిల్లలు ఆరోగ్యంగా ఉంటే అన్ని ఉన్నట్లేనని, తల్లిదండ్రులు ఎంత సంపాదించిన పిల్లలు ఆరోగ్యంగా లేకపోతే అన్ని కోల్పోయినట్లెనని శ్రీ శ్రీ విద్యాసంస్థల అధినేత యమ్‌బి.యస్‌శర్మ చెప్పారు. స్థానిక శ్రీరామ్‌ నగర్‌ 10వ రోడ్డులో ఉన్న శ్రీ శ్రీ పాఠశాలలో సుమారు 1200 మంది విద్యార్ధినీ, విద్యార్థులకు తట్టు, రుబెల్లా వ్యాక్సిన్‌ వేయించారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ విద్యాసంస్థ అధినేత యమ్‌బియస్‌ శర్మ మాట్లాడుతూ తట్టు, రుబెల్లా అనేది ఎంతో ప్రాణాంతకమైన వ్యాధి అని, ఈ వ్యాధికి సంభందించి 9 నెలల నుండి 15 సంవత్సరాల వయస్సు గల వారికి తప్పకుండా ఈ వ్యాక్సిన్‌ వేయించాలని, ఈ వ్యాక్సిన్‌ వేయించడం వల్ల భవిష్యత్తులో ఈ వ్యాధి బారిన పడకుండా ఉంటారన్నారు. తట్టు, రుబెల్లా అనేవి రెండు వ్యాధులు అయినప్పటికి ఒకే టీకాతో ఈ వ్యాధిని నివారించవచ్చన్నారు. ఈ వ్యాధి బారిన పడినవారు న్యూమోనియా, విరోచనాలు, మెదడు వాపు వంటి వ్యాధులకు ఒకే టీకా సరిపోతుందని, దీని వలన ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉందన్నారు. ఇది ఒక అంటువ్యాధి అని ఒకరి నుండి మరొకరికి సోకుతుందన్నారు. గర్భంతో ఉన్న మహిళలకు రుబెల్లా సోకితే పుట్టబోయే బిడ్డపై కూడా ప్రభావం చూపుతుందన్నారు. కొన్ని సందర్భాల్లో గర్భస్రావం, మృత శిశువు జన్మించడం వంటివి జరుగుతుందన్నారు. కాబట్టి 9 నెలల నుండి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఖచ్చితంగా ఈ టీకాను వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాకలంక పి.హెచ్‌.సి. డాక్టర్‌ ఆర్‌. గంగాభవానీ, చాటపర్రు పి.హెచ్‌.సి. డాక్టర్‌ లీలా ప్రసాద్‌, సూపర్‌వైజర్‌ నాగమల్లేశ్వర రావు, ఎ.ఎన్‌.ఎమ్‌.ు ప్రమీళ, నాగమణి, హెల్త్‌ అసిస్టెంట్‌ రామకృష్ణ, స్కూల్‌ సిబ్బంది హైస్కూల్‌ సూపర్‌వైజర్‌ రాజు, పబ్లిక్‌స్కూల్‌ ఇన్‌ఛార్జ్‌లు బి. పద్మావతి, ఎ.వి.ఎన్‌. మాధురి, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు త్రివేణి, సదాశివమ్మ, రాజేశ్వరి, దేవి, కిరణ్‌, శాస్త్రి మరియు ఆషా వర్క్‌ర్సు, అంగన్‌వాడి వాంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *