పన్ను విధానంలో కొన్ని మార్పులు చేయాలి

జియస్‌టి కౌన్సిల్‌ సభ్యులతో భేటీ అయిన ఎపి పిల్మ్‌, టివి మరియు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అంబికా కృష్ణ—
ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా): ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జియస్‌టి పన్ను విధానంలో చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి నటీనటులు, పంపిణీదారులు, నిర్మాతలు, ఎగ్జిబిటర్‌ు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను గురించి ఆంధ్రప్రదేశ్‌ పిల్మ్‌, టివి మరియు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అంబికా కృష్ణ ఆధ్వర్యంలో పలువురు తెలుగు చలన చిత్ర నిర్మాతలు శుక్రవారం న్యూఢిల్లీలోని జియస్‌టి కౌన్సిల్‌ సభ్యులను కలుసుకుని ఈ మేరకు ఒక వినతిపత్రం సమర్పించారు. అంబికా కృష్ణ మాట్లాడుతూ జియస్‌టి పన్నువిధానంలో కొన్నిమార్పులు చేయాలని, కొన్ని విషయాలలో స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షులు కిరణ్‌, ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి బాబు, రాజమండ్రి పార్లమెంటు సభ్యులు సిని నటులు మాగంటి మురళీమోహన్‌, పార్లమెంటు సభ్యులు జెసి దివాకర్‌రెడ్డి, నిర్మాతలు సి కళ్యాణ్‌, అంబికా రామచంద్రరావు, బూరుగుపల్లి శివరామకృష్ణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం అంబికా కృష్ణ మాట్లాడుతూ తాము చెప్పిన విషయాలను జియస్‌టి కౌన్సిల్‌ సభ్యులు సావధానంగా విన్నారని, సానుకూలంగా స్పందించారని చెప్పారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *