ప్రజలను వెన్నుపోటు పొడవడం ధర్మమేనా?

నంద్యాలను మరో పులివెందుల చేస్తా: జగన్‌—
నంద్యాల: చంద్రబాబు లాంటి నాయకులు తమకు వద్దని ప్రజలు అనే పరిస్థితి రాబోతోందని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. నంద్యాల ఉప ఎన్నిల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన పాండురంగాపురంలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ చంద్రబాబు కుయుక్తులు పనిచేయని గ్రామం ఇది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం ధర్మమేనా? గత ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను చంద్రబాబు ఇంతవరకు అమలు చేయలేదు. మీరు వేసే ఓటు ఎవరినో ఎమ్మెల్యే చేయడం కోసం కాదు, మూడున్నరేళ్ల చంద్రబాబు పనితీరుపై ఇస్తున్న తీర్పు ఇది. ఈ ఓటుతో రాష్ట్ర రాజకీయం మారబోతోంది. చంద్రబాబు లాంటి మోసం చేసే నాయకులు మాకొద్దని ప్రజలు ఓటు వేయనున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట మీద నిలబడాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఎన్నికలకు ముందు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడవడం ధర్మమేనా? చంద్రబాబు చేసే అన్యాయాలు, అధర్మాలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్‌ జగన్‌ అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో ప్రజలు న్యాయం, ధర్మం పక్షాన నిలబడాలని కోరారు. తమ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు చాపిరేవులలో జగన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఊడుమాల్పరం, పోలూరు వరకు ఈరోజు రోడ్‌షో సాగుతుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *