మీజిల్స్‌, రుబెల్లా వ్యాక్సిన్‌తో సంపూర్ణ ఆరోగ్యం

ఏలూరు హేలాపురి డైమండ్స్‌ లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు పెద్దిరెడ్డి ప్రదీప్‌—-

ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా) : ఏలూరు హేలాపురి డైమండ్స్‌ లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు పెద్దిరెడ్డి ప్రదీప్‌ ఆధ్వర్యంలో శుక్రవారం గవరవరంలోని జింగిల్‌ బెల్‌ స్కూల్లోని విద్యార్థులతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన వందలాది మంది విద్యార్థులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సహకారంతో మీజిల్స్‌ (తట్టు), రుబెల్లా వ్యాక్సిన్‌ను అందజేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి ప్రదీప్‌ మాట్లాడుతూ 2014లో వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తట్టు, రుబెల్లా నిర్మూలనకు ఇంటర్నేషనల్‌ లయన్స్‌ క్లబ్‌ 30 మిలియన్‌ డాలర్లకును విరాళంగా ప్రకటించిందన్నారు. 2020 నాటికి ఈ వ్యాధుల నిర్మూలనే ధ్యేయంగా లయన్స్‌ క్లబ్‌ పని చేస్తుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రుబెల్లా, తట్టు వ్యాధులను నిర్మూలించే భాగంలో ప్రజలకు ఈ వ్యాధుపై అవగాహణ కలిగిస్తున్నామని చెప్పారు. 9 నెలల నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న పిల్లలందరికీ తట్టు, రుబెల్లా టీకాలను తప్పని సరిగా ఇప్పించాలని తల్లిదండ్రులకు పెద్దిరెడ్డి ప్రదీప్‌ విజ్ఞప్తి చేశారు. వ­రికివాడల్లో నివసిస్తున్న ప్రజలకు మీజిల్స్‌, రుబెల్లా వ్యాక్సిన్‌ ప్రయోజనాలన్ని తెలియజేశామన్నారు. తట్టు, రుబెల్లా టీకా అత్యంత సురక్షితమైనదన్నారు. మీజిల్స్‌(తట్టు) ఒక ప్రాణాంతక వ్యాధి అని అన్నారు. ఈ వ్యాధి కారణంగా చిన్నారులు న్యూమోనియా, విరేచనాలు, మెదడు వాపు వంటి వ్యాధులకు గురవుతారన్నారు. ఒక్కొక్కసారి మరణానికి కూడా దారి తీయవచ్చునని పెద్దిరెడ్డి ప్రదీప్‌ చెప్పారు. దగ్గడం, తుమ్మడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి సోకుతుందన్నారు. తీవ్రమైన జ్వరం, చర్మం మీద ఎర్రని దద్దుర్లు, దగ్గు, జులుబు, కళ్లు ఎర్రబడటం తట్టువ్యాధి క్షణాని చెప్పారు. గర్భంతో ఉన్న మహిళలకు రుబెల్లా సోకితే పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందన్నారు. ఇటువంటి ప్రమాదకరమైన తట్టు, రుబెల్లాను తరిమికొట్టేందుకు 9 నెలల నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న పిల్లలందరికీ తప్పని సరిగా టీకాలు ఇప్పించాలని పెద్దిరెడ్డి ప్రదీప్‌ తల్లిదండ్రులను కోరారు. మీజిల్స్‌`రుబెల్లా వ్యాక్సిన్‌ శిబిరాన్ని ఎమ్మెల్సీ రాము­ సూర్యారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు హేలాపురి డైమండ్స్‌ లయన్స్‌ క్లబ్‌ కార్యదర్శి కడియాల విజయలక్ష్మి, క్లబ్‌ జోన్‌ చైర్‌పర్సన్‌ వడ్లపూడి కృష్ణమోహన్‌, ఫాస్ట్‌ కార్యదర్శి ఉప్పలపాటి నాగవెంకట సత్యనారాయణ, సహాయ కార్యదర్శి బోళ్ల శ్రీనివాసరావు, ఫాస్ట్‌ ప్రెసిడెంట్‌ శివనాగ పోతురాజు, సభ్యులు వి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *