జగన్‌ ఉన్మాదం తారాస్థాయికి చేరుతోంది

ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు—
అమరావతి: వైకాపా అధినేత జగన్‌ ఉన్మాదం రోజురోజుకీ తారాస్థాయికి చేరుతోందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్‌ అధికారం కోసం ప్రజలకు కీడు చేసేందుకు కూడా వెనకాడట్లేదని ఆరోపించారు. తన రాజకీయ జీవితంగా ఇలాంటి విపరీత ధోరణి ఉన్న నేతను ఎన్నడూ చూడలేదన్నారు. ప్రజాస్వామ్య విలువకు, రాజ్యాంగ ఔన్నత్యానికి జగన్‌ కళంకం తెస్తున్నారని ఆక్షేపించారు. ముఖ్యమంత్రిని ఎన్ని తిట్లు తిడితే అన్ని ఓట్లు పడతాయని జగన్‌కు ఎవరో చెప్పినట్లున్నారని ఎద్దేవా చేశారు. సీఎం పదవి దక్కదనే అక్కసుతోనే జగన్‌ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని.. ఉన్మాద క్షణాలున్న ఇలాంటి నాయకుడు ప్రతిపక్ష నేతగా పనికిరాడన్నారు. జగన్‌ వ్యాఖ్యలపై ఎన్నిక సంఘం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *