దాడులను తక్షణమే విరమించుకోవాలి

ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా): బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద శక్తులు ఈదేశంలోని ప్రగతిశీల, అభ్యుదయ, వాదులపై రోజురోజుకి దాడులు అధికం చేస్తున్నారని వారు ఆ దాడులు తక్షణం విరమించుకోవాలని లేని పక్షంలో ఈ దేశ ప్రజల అగ్రహానికి గురి కావలసి వస్తుందని సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్‌ పుప్పా కన్నబాబు హెచ్చరించారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌) అఖిల భారత విద్యార్ధి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో ‘సేవ్‌ఇండియా ` ఛేంజ్‌ ఇండియా’ నినాదంతో కన్యాకుమారి నుండి హుస్సేన్‌వాలా (పంజాబ్‌) వరకు జరుగుతున్న యాత్ర బిజెపి ఎన్నికలలో యువతకిచ్చిన ఏటా 2 కోట్ల ఉద్యోగాల కల్పన, సమగ్ర యువజన విధానం రూపొందించాలని దేశ యువతను చైతన్యపరుస్తూ సాగుతున్న లాంగ్‌మార్చ్‌ గురువారం మధ్యప్రదేశ్‌లోని ‘ఇండోర్‌ నగరంలో ప్రవేశించినప్పుడు మతోన్మాద ఆర్‌ఎస్‌ఎస్‌ మతతత్వ బిజెపి గుండాలు ఈ యాత్రపై దాడిచేసి ఆరుగురు యువజన, విద్యార్ధి నాయకులను తీవ్రంగా గాయపరచడంతో పాటు కాన్వాయ్‌లోని వాహనాలు ధ్వంసం చేసారు. ఇలా దేశంలోని అభ్యుదయ ప్రగతిశీల వాదులపై దాడులకు పాల్పడటం హేయమైన చర్య అని ఇటువంటి ఘటనలు తిరిగి పునారవృతమైతే ఖచ్చితంగా ప్రతిదాడులు ఎదుర్కొవసి వస్తుందని పుప్పాల కన్నబాబు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర సమితి సభ్యులు కె కన్నయ్య, పి రామకృష్ణ, అమానుద్దీన్‌, భారతి సుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శి హేమశంకర్‌, ఏఐవైఎఫ్‌ ఏలూరు నగర కార్యదర్శి నాగం అచ్యుత్‌, జిల్లా కార్యదర్శి గాళ్ల శారద, జె శేఖర్‌, దుర్గారావు, వెంకన్న, ఆటోన్నారాయణ, యాత్ర తదితరులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *