అరాచకత్వానికి-అభివృద్ధికి పోటీ

ఏపీ మంత్రి దేవినేని మహేశ్వరరావు—
విజయవాడ : నంద్యాలో అరాచకత్వానికి-అభివృద్ధికి మధ్య పోటీ జరుగుతోందని ఏపీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు అన్నారు. రాష్ట్రానికి అసమర్థ ప్రతిపక్ష నాయకుడు ఉండటం శోచనీయమన్నారు. విజయవాడలో దేవినేని మీడియాతో మాట్లాడారు. జగన్‌ తండ్రి కాలువల్లో అవినీతి సొమ్ము పారిస్తే.. తాము కాలువల్లో నీరు పారిస్తున్నామని చెప్పారు. నీటిపారుదల అంశాపై జగన్‌ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. జగన్‌కు క్యూసెక్కులు, టీఎంసీలకు తేడా తెలియదని విమర్శించారు. సాక్షి పత్రిక, ఛానల్‌ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్‌ చేసిన వ్యాఖ్యలను ఎన్నిక సంఘం సుమోటోగా తీసుకోవాలని కోరారు. పట్టిసీమతో రైతులు ఆనందంగా పంటలు పండించుకుంటున్నారని.. పట్టిసీమపై ఒక్కసారైనా ప్రతిపక్ష నేత మాట్లాడలేదని అన్నారు. పోవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *