ఎంఆర్‌ వ్యాక్సిన్‌ తప్పనిసరిగా వేయించాలి

గోపాలపురం, (పశ్చిమ గోదావరి జిల్లా): ఎంఆర్‌ వ్యాక్సిన్‌ ప్రతి చిన్నారి నుండి15 సంవత్సరాల లోపు ప్రతీ ఒక్కరికి వేయించాలని పిహెచ్‌సి హెల్త్‌ కోఆర్డినేటర్‌ కె విజయ కుమారి అన్నారు. స్థానిక కుమ్మర కుంటలోని అంగన్‌వాడీ సెంటర్‌లో శనివారం చిన్నారులకు ఎంఆర్‌ వ్యాక్సిన్‌ కార్యక్రమం నిర్వహించారు. హెల్త్‌ కోఆర్డినేటర్‌ విజయకుమారి మాట్లాడుతూ ఎంఆర్‌ వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాత ఏ విధమైన టీకాలు వేయరాదన్నారు. నాలుగు జబ్బులకు ఎంఆర్‌ వ్యాక్సిన్‌ ద్వారా నిరోదించవచ్చన్నారు. మండలంలోని అంగన్‌వాడీ సెంటర్లు, ఎంపిపి, ఎంపియుపి, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోనూ వ్యాక్సిన్‌ వేయడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకూ 80 శాతం పిల్లలకు టీకాలు వేయడం జరిగిందన్నారు. ఎంపిఈవో అప్పికట్ల శ్రీరామరాజు, అంగన్‌వాడీ కార్యకర్తలు సిహెచ్‌ విజయలక్ష్మీ ఆశావర్కర్లు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *