చరిత్ర సృష్టించిన కోహ్లీసేన

3-0తోలంకపై సిరిస్‌ క్లీన్‌ స్వీప్‌
హైదరాబాద్‌: కోహ్లీ సేన చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీలంకతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 171 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. మొదటి, రెండవ టెస్టుల్లోనూ గెలిచిన కోహ్లీసేన చివరిదైన మూడో టెస్టులోనూ గెలవడంతో విదేశీ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసి సరికొత్త రికార్డును సాధించింది. మూడో టెస్టులో కోహ్లీ సేన విజయం సాధించడంతో విదేశాల్లో మూడు టెస్టు సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన జట్టుగా కోహ్లీసేన నిలిచింది. భారత జట్టు తన 85 ఏళ్ల టెస్టు చరిత్రలో విదేశాల్లో మూడు టెస్టల సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన దాఖలాలు లేవు. ఆ రికార్డును ఇప్పుడు కోహ్లీసేన తన ఖాతాలో వేసుకుంది.
పరాయి గడ్డపై తొలిసారి
మూడు టెస్టు సిరీస్‌లో శ్రీలంకను కోహ్లీసేన వ్కెట్‌వాష్‌ చేసింది. పరాయి గడ్డపై తొలి క్లీన్‌స్వీప్‌ ఘనత అందుకొంది. గతంలో ఏ భారత సారథికీ సాధ్యం కాని ఈ రికార్డును కోహ్లీ సాధించాడు. ఆతిథ్య జట్టుకు వారి సొంతగడ్డపైనే రెండో వ్కెట్‌వాష్‌ ఓటమి రుచి చూపించాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒక హోం టీమ్‌ క్లీన్‌స్వీప్‌ కావడం ఇది ఏడోసారి. దీంతో టీమిండియా అరుదైన రికార్డును బద్ధల కొట్టినట్టైంది.
చెప్పుకోదగ్గ పరుగులు చేశాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 487 పరుగులకు ఆలౌటైంది. లంక తొలి ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే ఆలౌటైంది. ఆనంతరం ఫాలోఆన్‌ ఆడిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌటైంది. టెస్టు సిరిస్‌ అనంతరం ఆగస్టు 20 నుంచి లంక-భారత్‌ జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది.
పేస్‌.. స్పిన్‌తో వణికించారు
లంకేయులను భారత బౌలర్లు పదునైన బౌలింగ్‌తో వణికించారు. చురకత్తుల్లాంటి బంతులు విసిరారు. ఓ వైపు స్పిన్‌.. మరో వైపు పేస్‌తో దాడి చేశారు. దీంతో ఫాలోఆన్‌లో ఓవర్‌ నైట్‌ స్కోరు 19/1తో మూడో రోజు, సోమవారం బరిలోకి దిగిన ప్రత్యర్థి 181 పరుగులకే కుప్ప కూలింది. నైట్‌ బ్యాట్స్‌మన్‌ కరుణ రత్నె (16)ను అశ్విన్‌ 26 పరుగుల వద్ద ఔట్‌ చేశాడు. చండిమాల్‌ను ఔట్‌ చేయడం ద్వారా ఈ జోడీని కుల్‌దీప్‌ విడదీశాడు. ఆ తర్వాత మాథ్యూస్‌ను అశ్విన్‌ ఎల్బీ చేయడంతో శ్రీలంక పతనం మరింత వేగం పుంజు కొంది. పెరీరా (8), సండకాన్‌ (8) వెంటవెంటనే ఔట్కెనా డిక్వెలా (41బీ 52 బంతుల్లో 5ఐ4) ఆఖర్లో మెరుపు మెరిపించాడు. లహిరు కుమార (10)ని అశ్విన్‌ బోల్తా కొట్టించడంతో లంక కథ ముగిసింది. అశ్విన్‌ (4/68), మహ్మద్‌ షమి (3/32), ఉమేశ్‌ యాదవ్‌ (2/1) కుల్‌దీప్‌ (1/56) బౌలింగ్‌లో రాణించారు. హార్దిక్‌ పాండ్యామ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, శిఖర్‌ ధవన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికయ్యారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *