జాగ్రత్తగా మసులుకోవాలి

గైర్హాజరు అయితే సీట్లు ఆశించొద్దు—
పార్టీ ఎంపీకు నరేంద్ర మోదీ హెచ్చరిక—
దిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలకు పార్టీ ఎంపీ గైర్హాజరుపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకపోతే.. 2019 ఎన్నికల్లో సీట్లు ఆశించొద్దని పార్లమెంటు సభ్యులకు హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటి వరకు మీ ఇష్టారీతిన వ్యవహరించారు, ఇకపై ఇలా సాగదు రాజ్యసభలో అమిత్‌షా అందర్నీ గమనిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు నాకు సమాచారం అందిస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా మసులుకోవాలి.’ అని మోదీ ఎంపీకు సూచించారు. ఒక్కసారి చర్యలు తీసుకున్న తర్వాత మళ్లీ వెనక్కితగ్గమని తెలిపారు. బీసీ సవరణ బిల్లుపై కూడా ఓటు వేసేందుకు ఎంపీలు హాజరు కాలేదని గుర్తు చేశారు. ఇప్పటి నుంచి కఠిన నిబంధనలు అమలు జరుగుతాయని చెప్పారు. గతంలోనూ భారతీయ జనతా పార్టీ ఎంపీకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. పార్లమెంటు సమావేశాల్లో జరిగే ప్రతి చర్చలో ఎంపీలు పాల్గొనాని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సమయాల్లో తప్పకుండా అందరూ సభకు హాజరు కావల్సిందేనని పార్టీ ఎంపీనుద్దేశించి మోదీ అన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *