నయనతార గుట్టు బయటపెట్టేసింది

నయనతార గురించి ప్రతిదీ రహస్యమే. మిగతా హీరోయిన్ల లాగా నయన్‌ పబ్లిక్‌లో కనిపించడం తక్కువ. అలాగే సినిమా ప్రమోషన్లలో పాల్గొనదు. మీడియాతో మాట్లాడదు. ఇంటర్వ్యూులు ఇవ్వదు. తన వ్యక్తిగత విషయాలు గురించి మాట్లాడటానికి కూడా నయన్‌ ఇష్టపడదు. ఐతే తాజాగా ఒక టీవీ షోలో పాల్గొన్న నయన్‌ తన గురించి కొత్త సంగతులు తెలిపింది. నయన్‌కు కవితలు రాయడం అంటే చాలా ఇష్టమట. చిన్నప్పట్నుంచి తనకు ఈ హాబీ ఉందని.. ఇప్పటికే చాలా కవితలు రాశానని.. వివిధ అంశాపై తాను పొయెట్రీ రాస్తుంటానని నయన్‌ వెల్లడించింది. తనకు ఎప్పుడు ఖాళీ దొరికినా.. పెన్నూ పేపరు పట్టి కవితలు రాయడం మొదలుపెడతానని ఆమె చెప్పింది. అలాగే తాను కొత్త వంటలు చేయడం కూడా ప్రయత్నిస్తుంటానని నయన్‌ వెల్లడించింది. రైతుల నీటి సమస్యలపై పోరాడే ఓ బ్యూరోక్రాట్‌ పాత్రను చేస్తోంది నయన్‌ ఇందులో. ఈ సినిమాను ప్రమోట్‌ చేయడం కోసం నయనకు ప్రత్యేకంగా రూ.40 లక్ష దాకా పారితోషకం ఇచ్చారట. దీంతో ఆమె టీవీ షోలకు వెళ్తూ.. మీడియా వాళ్లను కలుస్తూ సినిమాను ప్రమోట్‌ చేస్తోంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *