పోలీసు ట్రైనింగ్‌ సెంటర్‌ను సందర్శించిన ఎస్పీ

ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా): జిల్లాలో గల డిస్ట్రిక్ట్‌ పోలీసు ట్రైనింగ్‌ సెంటర్లో కమ్యూనికేషన్‌ పోలీసు కానిస్టేబుళ్ళ ట్రైనింగ్‌ కొరకు 70 మహిళాలు 164 పురుషు అభ్యర్ధులు డిస్ట్రిక్ట్‌ పోలీసు ట్రైనింగ్‌ సెంటర్లో హాజరైనారు. జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్‌ డిస్ట్రిక్ట్‌ పోలీసు ట్రైనింగ్‌ సెంటర్‌ను సందర్శించి గ్రౌండ్‌, క్లాసురూమ్స్‌, వంటసాలలు, అభ్యర్ధులకు కలిపించాల్సిన వసతి సదుపాయలు మరియు మహిళా అభ్యర్ధులకు ప్రత్యేకమైన వసతి సదుపాయలు ఏర్పాటును గుర్తించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. శిక్షణ కాలము నందు అభ్యర్ధులకు కంప్యూటర్ల పట్ల అవగాహన అత్యధునిక సాంకేతిక పరిజ్ఞానములో మరియు చట్టాల పట్ల మంచి శిక్షణ మరియు తర్ఫీదు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్‌పి వి రత్న, డిటిసి డిఎస్పీ రాజేశ్వరరెడ్డి, డిటిసి ఆర్‌ఐ మురళి మరియు డిటిసి పోలీసు సిబ్బంది హాజరయ్యారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *