బాబుకు అహంకారం పెరిగింది

నంద్యాల: ఉప ఎన్నికలు వచ్చాయి కాబట్టే ప్రతీ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు ఎరవేస్తున్నారని వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరో రోజు నంద్యాల ఏటీఏం సెంటర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు. పాలన పేరుతో విపరీతమైన అవినీతి చేస్తున్న చంద్రబాబుకు ఈ మూడున్నరేళ్లలో అహంకారం కూడా పెరిగిందని, ఆయన కళ్లు తకెక్కాయని జగన్‌ విమర్శించారు. తాను వేస్తున్న ఎరకు లొంగకపోతే చంద్రబాబు బుజ్జగింపు, బెదిరింపులకు ప్పాడుతున్నారని జగన్‌ పేర్కొన్నారు. టీడీపీ నేతలంతా నంద్యాలలోనే ఉన్నారని, కేబినెట్‌ మొత్తం ఇక్కడే తిష్ట వేసిందని జగన్‌ తెలిపారు. వైఎస్సార్‌ సీపీ పోటీ చేయకపోయి ఉంటే ఈ మంత్రులంతా మీకు కనిపించేవారా? అని ప్రజలను ఆయన ప్రశ్నించారు. రేషన్‌ పాపుల్లో ఇంతకు ముందు 9 రకాల ఇచ్చేవారని, ఇప్పుడు కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారని జగన్‌ పేర్కొన్నారు. విలువతో కూడిన రాజకీయాలే నా ఆస్తి అని ఈ సందర్బంగా ఆయన మరోసారి ప్రకటించారు. నంద్యాలలో ఉధృతంగా వైఎస్‌ జగన్‌ ప్రచారం కొనసాగుతోంది. ప్రతిచోటా వైఎస్‌ జగన్‌ రోడ్‌షోకు జనం భారీ సంఖ్య తరలివస్తున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *