మంచానపడ్డ పెద్దగూడెం

ఒక్కో ఇంటికి నలుగురు, ముగ్గురు జ్వరపీడితులు—-
పారిశుద్ధ్యం అధ్వాన్నం, వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న రోగులు—-
ప్రైవేటు వైద్యులపైనే భారం—-
గోపాపురం, (పశ్చిమ గోదావరి జిల్లా): స్థానిక పెద్దగూడెంలో ఒక్కో ఇంటిలో నలుగురు, ముగ్గురు జ్వర పీడితులు మగ్గిపోతున్నారు. కనీసం ఇంటి నుండి ఆసుపత్రికి తీసుకువెళ్లేవారు కూడా కరువయ్యారు. స్థానిక పెద్దగూడెంలో జ్వరాల సంఖ్య 25 మంది వరకూ మంచాన పడ్డారు. కొడవటి నాగేశ్వరరావు కుటుంబంలో నాగేశ్వరరావు, భార్య మరియమ్మ, కుమార్తె జోష్న, స్వప్నలు నలుగురు గతవారం రోజుగా మంచాన పడివున్నారు. కనీసం ఇంటి యజమానికి నాగేశ్వరరావు జ్వరంతో ఉండటంతో ఇంటి నుండి ఆసుపత్రికి వెళ్లడానికి కూడా వీలులేకుండా ఉందని వాపోయాడు. ప్రయివేటు వైద్యులతో వైద్యం చేయించుకుంటున్నా వారం రోజుగా తగ్గడం లేదని నాగేశ్వరరావు తెలిపారు. అదే విధంగా నాలుగు రోజుగా ఇంటి వీరేషు, కుమారుడు ప్రసాద్‌వలు మంచం పట్టివున్నారు. పెద్దగూడెంలోకి గత 20 రోజులుగా ఏఎన్‌ఎం గానీ, వైద్యుకానీ కన్నెత్తి చూడటం లేదని రోగులు వాపోతున్నారు. స్థానిక పిహెచ్‌సికి వెళ్లినా అక్కడ వైద్యులు లేక ప్రయివేటు వైద్యులను ఆశ్రయించడంతో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలకు తగిన వైద్యం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం వెంటనే వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి రోగులను కాపాడాలని వేడుకుంటున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పు వల్ల ఇటీవల కురిసిన వర్షాలకు వాడకపు నీరు బయ టకు వెళ్లకుండా ఉండటంతో దోమ ఉధృతి పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నట్లు చెప్పారు. గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయాని వేడుకుంటున్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *