శ్రీశ్రీ పబ్లిక్‌ స్కూల్‌లో ఘనంగా కృష్ణాష్ఠమి వేడుకలు

ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా): శ్రీకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని కృష్ణాష్టమి వేడుకలను శ్రీశ్రీ పబ్లిక్‌ స్కూల్‌ శ్రీరామ్‌నగర్‌ క్యాంపస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాథ్యాయులు పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులచే గోపిక వేషధారణలతో చిన్నారులచే నృత్య ప్రదర్శనలు అద్భుతంగా నిర్వహించబడ్డాయి. వేడుకకు ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీశ్రీ విద్యాసంస్థల అధినేత యమ్‌.బి.యస్‌. శర్మ మాట్లాడుతూ శ్రీకృష్ణుడు సర్వ సమగ్ర వ్యక్తిత్వ వికాస నిపుణుడని తెలిపారు. గీతాచార్యునిగా శ్రీకృష్ణుని వ్యక్తిత్వం శిఖరాయమానమైనదని, భగవద్గీత ద్వారా ఆయనను ప్రపంచం ఒక గొప్ప మానసిక శాస్త్రవేత్తగా, రాజనీతిజ్ఞునిగా గుర్తించిందని అన్నారు. శ్రీకృష్ణ లీలలను విద్యార్ధుకు వివరించారు. ప్రాపంచీకరణతో, నవీన నాగరికతతో సాంప్రదాయ విలువలు మరిచిపోతున్న తరాలకు మన భారతీయ సాంప్రదాయ విలువలు తెలియజెప్పాలనే ఉద్దేశంతో తమ విద్యాసంస్థలో ఇటువంటి పర్వదినాలు ఏర్పాటు చేయడం జరిగిందని శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్‌ ఇన్‌ఛార్జ్‌ బి. పద్మావతి, ఎ.వి.ఎన్‌. మాధురి, ఉపాథ్యాయినీ ఉపాథ్యాయులు పాల్గొన్నారు. పెద్దసంఖ్యలో చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *