పురస్కారాలు స్ఫూర్తిగా తీసుకోవాలి

జిల్లా పోలీసు అధికారులకు ఎస్పీ రవిప్రకాష్‌ విజ్ఞప్తి—-
ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా): జిల్లాలో పని చేస్తున్న పోలీసు అధికారులకు ఉగాది పురస్కారాలు 2017 గాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. 71వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్‌ మాట్లాడుతూ ఈ పురస్కారాలు అందుకున్న పోలీసు అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పోలీసు సిబ్బంది క్రమశిక్షణ కలిగిన ఉద్యోగంలో చేరి ప్రజలకు మేలు, సేవ చేసేనందుకు ప్రభుత్వం ఈ పురస్కారాలు ప్రకటించడం జగిరిందన్నారు. దానిని స్పూర్తిగా ప్రతి ఒక్కరు తీసుకుని ప్రజలకు సేవ చేసి, కష్టపడి ఉద్యోగ నిర్వహణ చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి ఒక్కరు ఈ పురస్కారాలు సాధించాలని తెలియజేశారు. ఈ పురస్కారాలు అందుకున్న వారి వివరాలు మహ్నాత సేవ పతాకం ఏఆర్‌ఎస్‌ఐ 65 జి జీవన్‌రావు, డిఏఆర్‌, ఏలూరు, ఉత్తమ సేవ పతాకం ఎస్‌ఐ 133 ఏ అప్పారావు, డిఎస్‌బి, ఏలూరు, ఏఆర్‌ఎస్‌ఐ 145 విఎస్‌ మురళీమోహన్‌, డిఏఆర్‌, ఏలూరు, ఉత్తవ సేవ పతాకం డిఎస్‌పి ఎస్‌ విజయశేఖర్‌, ఎస్‌సిఅండ్‌ఎస్‌టి సెల్‌1, ఏలూరు, శరత్‌రాజు కుమార్‌, సిఐ కొవ్వూరు రూరల్‌, ఆర్‌ఎస్‌ఐ 3288 ఎస్‌ఎస్‌ మావుళ్ళయ్య, డిఏఆర్‌, ఏలూరు, ఏఎస్‌ఐ 537 జివి సుబ్బారావు, ప్రస్తుతం రిటైర్‌, హెచ్‌సి 972 ఎంఎస్‌ఎస్‌వి విశ్వేశ్వరావు, ప్రస్తుతం రిటైర్‌, ఏఆర్‌హెచ్‌సి 201 జి జయరాజు, డిఏఆర్‌, ఏలూరు, హెచ్‌సి 1354 ఎంవిఆర్‌ చంద్రరావు, ప్రస్తుతం రిటైర్‌,, హెచ్‌సి 1368 కె సుర్పరాజు, ప్రస్తుతం రిటైర్‌, హెచ్‌సి 1776 కె నాగరాజు, డిఎస్‌బి, ఏలూరు, పిసి 548 డి జాన్‌ బాబు, ఇరగవరం పిఎస్‌, పిసి 2199 డి నాగేశ్వరరావు, చాగల్లు పిఎస్‌, పిసి 325 వై మురళీకృష్ణ, ద్వారకాతిరుమల పిఎస్‌, ఏఆర్‌పిసి 1100 జి గజేంద్రబాబు, డిఏఆర్‌, ఏలూరు, ఏఆర్‌పిసి 1088 ఎంఆర్‌సిహెచ్‌ రావు, డిఏఆర్‌, ఏలూరు, హెచ్‌సి 1385 పి సుబ్బారావు, భీమవరం సిసిఎస్‌ పిఎస్‌.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *