మహాత్ముల సేవలు మహనీయం

విజెఎఫ్‌ ఆధ్వర్యంలో ఘనంగా 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలువిజెఎఫ్‌ ఆధ్వర్యంలో ఘనంగా 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు—-

విశాఖపట్నం, (విశాఖ జిల్లా) భారత స్వాతంత్ర్య పోరాటంలో ఎంతోమంది త్యాగమూర్తుల పోరాట పటిమ వల్లే మనకు స్వాతంత్ర్య ఫలాలు సిద్ధించాయని  వైజాగ్‌ జర్నలిస్టు ఫోరమ్‌ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు. మంగళవారం ఉదయం సీతమ్మధార విజెఎఫ్‌ వినోద వేదికలో 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కార్యవర్గం ఘనంగా నిర్వహించింది. తొలుత జాతీయపతాకాన్ని విజెఎఫ్‌ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో జర్నలిస్టు కూడా కీలక పాత్ర పోషించారన్నారు. సభ్యుల సంక్షేమం కోసం పూర్తిస్థాయిలో కృషి చేస్తామన్నారు. విజెఎఫ్‌ కార్యదర్శి ఎస్‌. దుర్గారావు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆగష్టు 15, రిపబ్లిక్‌ డే దినోత్సవ వేడుకులు విజెఎఫ్‌లో జరుపుకోవడం ఆనందంగా వుందన్నారు. వచ్చే నెల మొదటి వారంలో సభ్యులకు డ్రైవింగ్‌, పాస్‌పోర్టు మేళా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు ఇరోతి ఈశ్వరరావు, గయాజ్‌, శేఖరమంత్రి, వరక్ష్మి, సీనియర్‌ పాత్రికేయులు చింతా ప్రభాకరరావు, పల్లా రాజారావు, కిల్లి ప్రకాష్‌, విజయసింహా, వీడియో జర్నలిస్టు అధ్యక్షులు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.వైజాగ్‌ జర్నలిస్టుకు అవార్డు అంకితం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జర్నలిజం (సేవారంగం) లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయ చినరాజప్ప, జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రం స్వీకరించడం సంతోషంగా వుందని వైజాగ్‌ జర్నలిస్టు ఫోరమ్‌ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. ఈ అవార్డు విశాఖ జిల్లా జర్నలిస్టులకు అంకితమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అందరి సహకారంతో జర్నలిస్టు సంక్షేమానికి మరెంతో కృషి చేస్తామన్నారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఇప్పటి వరకు ఆయా ప్రభుత్వాల నుంచి 9 అవార్డులను తీసుకోవడం సంతోషదాయకమన్నారు. తనకు సహకరించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *