యువత నిరాశ నిసృహలను వీడాలి

దేశాన్ని కొత్తపథంలో నడిపిస్తున్నాం: మోదీ—
దిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సమయంలో ప్రాణార్పించిన మహనీయులను అందరూ స్మరించుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దిల్లీలో ఎర్రకోటలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 125 కోట్ల మంది భారతీయుందరం ఒక్కట్కె కొత్త సంకల్పంతో ఏదైనా సాధించగలం. 21వ శతాబ్దంలో జన్మించిన నవ యువకులకు ఈ జనవరి 1 కొత్త అవకాశాన్ని ఇస్తోంది. ఈ శతాబ్దిలో జన్మించిన యువత మొదటి సారి ఓటు హక్కు సాధించుకోబోతోంది. దేశ ప్రగతిని కొత్త దిశగా నడిపించే అవకాశం యువతకు వస్తోంది. దేశ యువత నిరాశ నిసృహలను వీడి ముందుకు నడవాలి. కొత్త సంకల్పంతో దూసుకుపోవాలి.’ అని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ దేశం నిజాయతీపరుది. ఇందులో అక్రమార్కులకు చోటు లేదు. బినామీ ఆస్తుల చట్టాన్ని తీసుకొచ్చి రూ.800 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నాం. సముద్రం, సరిహద్దు, సైబర్‌ ఏ విషయంలోనైనా రాజీపడే ప్రసక్తే లేదు. జీఎస్టీని తీసుకొచ్చి సహకార వ్యవస్థలకు జవసత్వాలు అందించాం. జీఎస్టీని ఇంత తక్కువ సమయంలో ఎలా అమలు చేశారని ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ఈ దేశంలో నిబద్ధత, సాంకేతికతలో ఉన్న నైపుణ్యత జీఎస్టీని సుసాధ్యం చేసింది. దేశంలోని నలుమూలకు విద్యుత్‌ వెలుగు ప్రసరిస్తున్నాయి. ఇంటింటికీ గ్యాస్‌ పొయ్యి ద్వారా కోట్లాది పేద మహిళలకు పొగ నుంచి విముక్తి కలిగించాం. ప్రభుత్వ వ్యవహారాలను సులభతరం చేసే కార్యక్రమంలో వేగం పుంజుకున్నాం. ప్రభుత్వ నిబంధనల బంధనాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించే ప్రయత్నం కొనసాగుతోంది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఓఆర్‌ఓపీని అమల్లోకి తెచ్చాం. జమ్ముకాశ్మీర్‌ ప్రభుత్వంలో కలిసి అక్కడి ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నాం. కాశ్మీర్‌ అభివృద్ధి, ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ దేశం కట్టుబడి ఉంది. కొన్ని సమస్యలు ఆరోపణలు, తుపాకులతో పరిష్కారం కావు. ప్రజలు ఒకరికొకరు మమేకమైనప్పుడే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రజంతా భుజం భుజం కలిపినప్పుడే శత్రువును సమర్థంగా ఎదుర్కోగలం. దేశంలో వేగవంతమైన చర్యకు శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రాలకు మరింత ఆర్థిక సౌభ్యాన్ని కల్పించి వేగవంతమైన అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఉదయ్‌ పథకం ద్వారా రాష్ట్రాలకు జవసత్వాలు చేకూర్చాం. రైతులకు సాగునీరు ఇస్తే బంగారం పండిస్తారు. ప్రధానమంత్రి కృషి యోజన ద్వారా రైతులకు సాగు నీరందించే కార్యక్రమం వేగవంతం చేస్తున్నాం. మార్కెట్‌ వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు కొత్త విధానాలతో ముందుకొస్తున్నాం నష్టాల్లో ఉన్న అన్నదాతను వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నాం. అప్పుల్లో కూరుకుపోయిన రైతన్నకు చేయి అందించే కార్యక్రమం ప్రభుత్వం చేస్తోంది. యువత ఆర్థిక సాయం మందిస్తే ఉద్యోగం కోసం ఎదురుచూడరు.. కొత్త ఉద్యోగాలు సృష్టిస్తారు. ముద్ర యోజన ద్వారా అనేక మంది యువత కొత్త ఉద్యోగాలు సృష్టించారు అని మోదీ పేర్కొన్నారు. ట్రిపుల్‌ తలాక్‌పై దేశం మొత్తం ఆందోళన చెందింది. ఈ విధానం ద్వారా ఎందరో ముస్లిం మహిళలు నిరాశ్రయులయ్యేవారు. దీనిపై కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ప్రజలందరూ అండగా నిలిచారు. ఈ దేశంలో మత విశ్వాసాల పేరుతో ఎలాంటి ఆందోళనలకు చోటులేదు. దేశంలో ఉన్న ప్రతి పౌరుడు సంపూర్న హక్కుతో జీవించే అవకాశం ఉంది అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *