సర్వమత సామరస్యాన్ని కాపాడుకోవాలి

ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా): భారతదేశ సర్వమత సామరస్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) అన్నారు. స్ధానిక నగరపాలక సంస్ధ కార్యాలయంలో మంగళవారం 71వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మాగంటి బాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సంపదను సౌభాగ్యాన్ని కాపాడుకోవాల్సిన కర్తవ్యం మనందరిపై ఉందన్నారు. దేశ ప్రజలందరూ స్వేచ్చగా స్వతంత్య్రంగా జీవనం సాగిస్తున్నారంటే ఆనాడు ఎందరో త్యాగమూర్తు వారి జీవితాను పణంగా పెట్టి సాధించిన స్వాతంత్య్రమేనని ఆయన గుర్తు చేశారు. నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాబు మాట్లాడుతూ ప్రతీ భారతీయుడూ జాతీయ భావాలతో అకుంఠిత దేశభక్తితో కలిసి దేశ నిర్మాణంలో పాల్గొన్నప్పుడే సమగ్రాభివృద్ధి జరుగుతుందన్నారు. ఏలూరు మున్సిపాల్టీగా ఏర్పడి 150 సంవత్సరాలు కావస్తున్నదని స్వాతంత్య్రం వచ్చి 71 సంవత్సరాలు గడిచినప్పటీ ఇప్పడిప్పుడే నగర ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చడంలో కొంతవరకూ సఫం అవుతున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పురపాకశాఖా మంత్రి నారాయణ, ఎంపి మాగంటి బాబు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి సహకారంతో ఏలూరు నగరాన్ని స్మార్ట్‌సిటీగా రూపుదిద్దుకుంటున్నామన్నారు. ఇందుకు తొలివిడతగా 762 కోట్ల రూపాయల నిధులు మంజూరైనాయని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి ఎంపి మాగంటి బాబు, నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాఋ పూ దండు వేసి నివాళుర్పించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *