స్వాతంత్రోద్యమ స్పూర్తితో నన్నయ అభివృద్ది

తాడేపల్లిగూడెం క్యాంపస్ ప్రత్యేకాధికారి ఆచార్య కె. రమేష్—-
తాడేపల్లిగూడెం, (పశ్చిమ గోదావరి జిల్లా) స్వాతంత్రోధ్యమ స్పూర్తిని ఆదర్శంగా తీసుకొని ఆదికవి నన్నయ యూనివర్సిటీ తాడేపల్లిగూడెం క్యాంపస్ అభివృద్దికి ప్రతీ ఒక్కరు పాటు పడాలని గూడెం క్యాంపస్ ప్రత్యేకాధికారి ఆచార్య కె. రమేష్ అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెంలోని నన్నయ క్యాంపస్ లో 71 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రత్యేకాధికారి ఆచార్య రమేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి సభనుద్దేశించి మాట్లాడారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్ర వచ్చిందని అన్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత అనేక కష్టాలను దేశం చవిచూసిందని అటువంటి విపత్తుల నుండి సమర్ధవంతమైన నాయకుల కృషి ఫలితంగా నేడు ఈ స్థాయికి వచ్చిందని తెలిపారు. అటువంటి స్వాతంత్రోద్యమ స్పూర్తిని, అటువంటి మేధోశక్తిని యూనివర్సిటి కుటుంబ సభ్యులంతా కలిగి ఉండాలని నిరంతరం క్యాంపస్ అభివృద్దినే లక్ష్యంగా పెట్టుకుని పని చేయాలని సూచించారు. అలాగే విద్యార్థులంతా ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పారు. ముఖ్యంగా మన యూనివర్సిటీ ఈ ఏడాది 12 బి గుర్తింపుకు ముందడుగు వేయడం, విశ్వవిద్యాలయ ఖ్యాతిని విస్తరింప చేయడం, రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ.45.23 కోట్లు బడ్జెట్ రావడం, నన్నయలో పీజీ సెంటర్లను విలీనం చేయడం వాటికి ప్రణాళికలు రచించడం మొదలైన ప్రముఖ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు. ఈ క్యాంపస్ ఏళ్ళ తరబడి అభివృద్దికి దూరంగా ఉందని దానిని పున సమీక్షించి అభివృద్ది పధంలో నడపాలనే ధృడ సంకల్పాన్ని అందరూ కలిగి ఉండాలని సూచించారు. అనంతరం స్వాతంత్ర సంబరాలలో భాగంగా యూనివర్సిటీ విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. దీనిలో క్యాంపస్ డా.ఎ.శుభాషిని, డా.బి.పి జ్యోతి, డా.ఎ.వి.బి బంగారురాజు, అజయ్ రత్నం, కృష్ణంరాజు, మూర్తి, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *