దళితులకు, విలేకరులకు మంత్రి క్షమాపణ చెప్పాలి

ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా): దళితులు, విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖామంత్రి ఆదినారాయణరెడ్డిని మంత్రి పదవి నుండి తొగించాలని బిసి సబ్‌ప్లాన్‌ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల సాధన పోరాట వేదిక జిల్లా కన్వీనర్‌ పిచ్చుక ఆదిశేషు, జిల్లా కోకన్వీనర్‌ పత్తిపాటి రామకృష్ణు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. దళితులకు, విలేకరులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. మంగళవారం కడప జిల్లా, జమ్మమడుగులోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి ఆది నారాయణరెడ్డి దళితులు శుభ్రంగా ఉండరు వారికి చదువు కూడరాదు కాని వారే సూపరిటెండెంట్లు అయిపోతారు అని వ్యాఖ్యానించారు. ఆసుపత్రి సూపరిటెండెంట్‌ రామేశ్వరుడు అధ్యక్షతన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితునుద్దేశించి ఒక్కసారిగా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వారు తెలిపారు. దళితులు శుభ్రంగా ఉండరు, వారికి చదువు రాదు అంటూ మాట్లాడిన ఆయన అంతటితో అగలేదు. రిజర్వేషన్‌ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఎదోలే వెనకబడ్డారని అప్పట్లో పదేళ్లు అంబేడ్కర్‌ వల్ల రిజర్వేషన్లు వచ్చాయి. పదేళ్లు పోయాయి. 70 ఏళ్లు పూర్తయ్యాయి. అయినా రిజర్వేషన్‌ కొనసాగుతున్నాయి. ఎన్ని వసతులు కల్పించినా దళితులు మారరని వ్యాఖ్యానించినట్లు వారు తెలిపారు. అరకొర చదువు చదువుకొని విలేకరులుగా వస్తున్నారని మేము చెప్పేది వ్రాయరని మిడిమిడి జ్ఞానంతో వార్తలు రాస్తారని విలేకరులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వారు తెలిపారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *