నంద్యాల అభివృద్ధికే ప్రాధాన్యత

రాష్ర్టం కోసం చంద్రబాబు కష్టపడుతున్నారు—-
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో బాలయ్య—-
నంద్యాల: రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాకృష్ణ అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు నియోజకవర్గంలో ఆయన రోడ్‌ షో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరపురంలో ఆయన మాట్లాడుతూ నంద్యాల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని.. ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రైతులకు రుణాల నుంచి విముక్తి కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసే అన్ని పనులను అడ్డుకోవడమే ప్రతిపక్షం లక్ష్యంగా పెట్టుకుందని బాలకృష్ణ విమర్శించారు. ప్రజలకు మంచి చేసే పనులపై సూచనలు ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వాన్ని విమర్శించడమే విపక్ష నేతలు పనిగా పెట్టుకున్నారని ఆక్షేపించారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *