పారిశుధ్యాన్ని సక్రమంగా నిర్వహించండి

సంతోషిమాత కాలనీ, చిట్టిబాబు కాలనీ సందర్శన—-
యుజిడి మేన్‌ హోల్స్‌ తెరచి మురుగు వెళ్ళేలా చూడండి—-
పాడుపడిన కమ్యూనిటీ హాలు పడగొట్టి పునర్నించండి—-
డ్రెయిన్‌ క్లియరెన్స్‌ ద్వారా పరిశుభ్రతకు దోహదపడండి—-
దోబిఘాట్‌ కమ్యూనిటీ హాలు నిర్మాణం పూర్తి చేయండి—-
సి.సి ఇంటర్నల్‌ రోడ్స్‌కు ప్రతిపాదనలు సమర్పించండి—-
ప్రజలు పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలి—-
పరిశుభ్ర విశాఖే ఆరోగ్య విశాఖకు నాంది కావాలి—-
కమిషనర్‌ హరినారాయణన్‌—-
విశాఖపట్నం, (విశాఖ జిల్లా): జివియంసి జోన్‌ 4 కు చెందిన 34వ వార్డులో పారిశుధ్యాన్ని సక్రమంగా నిర్వహించాలని కమిషనర్‌ హరినారాయణన్‌ పేర్కొన్నారు. 34వ వార్డు కార్యాలయాన్ని బుధవారం సందర్శించి హాజరు పట్టీ పరిశీలించారు. అనంతరం సంతోషి మాత కాలనీ, చిట్టిబాబు కాలనీ, సోనియా నగర్‌ కాలనీలో పర్యటించి పలు సూచనలు చేశారు. కాలనీలోని మేన్‌హోల్స్‌ తెరచి మురుగు రోడ్లపైకి ప్రవహించకుండా చూడాలని యుజిడి ఇ.ఇ శేఖర్‌ను ఆదేశించారు. కాలనీలోని కమ్యూనిటీ హాలు బాగా పాడుపడినందున దానిని పడగొట్టి పునర్నించాలని ఆదేశించగా ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించినట్లు జోనల్‌ కమిషనర్‌ యస్‌ రమణ మూర్తి పేర్కొన్నారు. దోబిఘాట్‌ నిర్మాణం చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. డ్రెయిన్‌ను పరిశుభ్రం చేయడం ద్వారా దోమల వ్యాప్తికి అవకాశం లేకుండా చూడాలని పేర్కొన్నారు. దోబిఘాట్‌, కమ్యూనిటీ హాలు నిర్మాణం అసంపూర్తిగా నున్నందున తక్షణం పూర్తి చేయాలని ఆదేశించారు. కాలనీలో సి.సి రోడ్ల నిర్మాణం చేపట్టడానికి ప్రతిపాదనలు రూపొందించాలని పేర్కొన్నారు. ప్రజలు, కానీ వాసు పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని, తడిచెత్త `పొడి చెత్తను వేర్వేరుగా పారిశుధ్య కార్మికులకు అందజేయాలని కోరారు. పరిశుభ్ర విశాఖ ఆరోగ్య విశాఖకు నాందికాగదని అభిషించారు. కాలనీ వాసులు ప్రజారోగ్య సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నట్లు కమిషనర్‌కు తెలియజెప్పారు. పర్యటనలో కమిషనర్‌ వెంట జోనల్‌ కమిషనర్‌ యస్‌.రమణమూర్తి, ఏ.యం.ఓ.హెచ్‌ డా.మురళీ మోహన్‌, ఏసిపి రాజేశ్వరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, జోనల్‌ సిబ్బంది పాల్గోన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *