మంగళగిరిలో ఏపీ డీజీపీ కార్యాలయం ప్రారంభం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పోలీసు ప్రధాన కార్యాలయాన్ని (డీజీపీ కార్యాలయం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి నిమ్మకాయ చినరాజప్ప, మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, డీజీపా సాంబశివరావు, పోలీసు ఉన్నతాధికారులు పాల్లొన్నారు. మంగళగిరి ఏపీ ఎస్పీ పటాంలో దాదాపు ఆరెకరాల విస్తీర్ణంలో రూ.40 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు. దీని నిర్మాణానికి పది నెలల సమయం పట్టింది. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలోని న్యాయస్థానాల సముదాయానికి సమీపంలో డీజీపీ క్యాంపు కార్యాయాలన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ డీజీపీతో పాటు అదనపు డీజీపీ, ఐజీ స్థాయి అధికారులకు మాత్రమే ఛాంబర్లు ఉన్నాయి. దీంతో కొన్ని విభాగాలు అధిపతులు ఇప్పటికీ హైదరాబాద్‌ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బస్టాండు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీఐడీ కార్యాయానికి తగిన వసతు లేవు. నూతన భవనం అందుబాటులోకి రావడంతో ఇకపై డీజీపీ కార్యాలయం పరిధిలోని అన్ని విభాగాలు అధిపతులు ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించనున్నారు.
పోలీసు ప్రధాన కార్యాలయం నిర్మాణ విశేషాలు
నిర్మిత ప్రాంతం: మొత్తం 1.10 లక్ష చ.అడుగులు, ఒక్కో అంతస్తులో: 21,200 చ.అడుగులు, ఎన్ని అంతస్తులు: జీ ప్లస్‌ 4, ఏ అంతస్తులో ఏ కార్యాలయం: గ్రౌండ్‌తో పాటు మొదటి అంతస్తులో సీఐడీ కార్యాలయం, రెండు, మూడు అంతస్తుల్లో అదనపు డీజీపీ, ఐజీ స్థాయి అధికారులు కార్యాయాలు, నాలుగో అంతస్తులో డీజీపీ కార్యాలయం, పేషీ, సమావేశ మందిరం భవనం ప్రత్యేకతలు ఒక్కో దాంట్లో 80 మందితో సమావేశం నిర్వహించుకునేందుకు వీలుగా మొత్తం మూడు సమావేశ మందిరాలు, ఒకేసారి వంద కార్లను పార్కు చేసుకునేందుకు వీలుగా స్ధలం, భవనం అంతరాగంలో కేవలం ఐదు శాతమే గోడలు, మిగతా 95 శాతం అద్దాలతోనే నిర్మితం, విశాలమైన ఉద్యానవనం, భవనం చుట్టూ పచ్చదనం, మూడు వైపులా కొండు, మరోవైపు జాతీయ రహదారి, ఏ గదిలోకి ప్రవేశించాలన్నా బయోమెట్రిక్‌ తప్పని సరి. వేలిముద్ర వేస్తేనే తలుపు తెరుచుకుంటాయి. భవనం మొత్తానికి వైఫై సౌకర్యం. పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టమ్‌, వీడియో వాల్స్‌ ఏర్పాటు చేశారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *