పాత్రికేయుడికి నెలకు 2 వేలు పెన్షన్‌ ఇవ్వాలి

పాత్రికేయుల సంక్షేమానికై ఎపిడబ్ల్యూజెఎఫ్‌ రాజీలేనిపోరాటం
ద్వారకా తిరుమల, (పశ్చిమ గోదావరి జిల్లా): జర్నలిజంలో పది సంవత్సరాల అనుభవం లేదా యాభై సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతీ పాత్రికేయుడికి నెలకు 2 వేలు పెన్షన్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ద్వారకాతిరుమలలో గురువారం జరిగిన ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్న లిస్టుల సమాఖ్య (ఏపిడబ్ల్యూజెఎఫ్‌) జిల్లా కార్యవర్గ సమావేశం తీర్మానం చేసింది. ద్వారకాతిరుమలలో శ్రీ వైష్ణవి రెసిడెన్సీలో ఎపిడబ్ల్యూజెఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బియమ్‌ ఆనంద్‌ అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆనంద్‌ మాట్లాడుతూ జర్నలిస్టు నేడు ఇబ్బందును ఎదుర్కొంటున్నారన్నారు. ప్రధానంగా చిన్న, మధ్య తరహా పత్రిక యజమాన్యాలు అందులో పని చేస్తున్న విలేఖరుల అనేక సమ స్యతో సతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఈనేపధ్యంలో ఎపిడబ్ల్యూజెఎఫ్‌ పాత్రికేయుల సంక్షేమానికై రాజీలేని పోరాటం చేస్తున్నదన్నారు. ఆ క్రమంలోనే జర్నలిస్టులకు గృహవసతి కల్పించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హమీ ఇవ్వటం జరిగిందన్నారు. త్రిబుల్‌ బెడ్‌ ఇళ్లు రాజధానిలో ఇవ్వాలని నిర్ణయించి కమిటీని ఏర్పాటు చేయడం పట్ల సమావేశంలో ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసారు. మండలాల్లో, మున్సిపాలిటీల్లో నిర్మిస్తున్న గృహ సముదాయాల్లో జర్నలిస్టులకు గృహాలు మంజూరు చేయాలని ఇందుకోసం ప్రత్యేక జివో ఇవ్వాలని కోరారు. అలాగే జిల్లా హైపర్‌ (అటాక్స్‌) కమిటీలో జిల్లా కార్యదర్శి కెయస్‌ శంకరరావుకు స్థానం కల్పించాలని కోరుతూ తీర్మానం చేసారు. జిల్లా కమిటీలో పర్‌ఫెక్ట్‌ న్యూస్‌ ఎడిటర్‌ సోడిశెట్టి శాంతకుమార్‌కు జాయింట్‌ సెక్రటరీగా, వెలుగుజ్యోతి సంపాదకుడు నల్లమిల్లి విజయరాజు ఉపాధ్యక్షుడిగా నామినేట్‌ చేస్తూ తీర్మానం ఆమోదించారు. జిల్లా నుంచి పాత్రికేయు, కార్యవర్గ సభ్యులు సుమారు 100 మంది హాజరయ్యారు. సమావేశంలో కోశాధికారి జబీవుల్లా, ఉపాధ్యక్షుడు టి శ్రీనివాస్‌, సోమశేఖర్‌, ఆకుల ప్రసాద్‌, కె గాంధీ తదితయి పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *