విద్యతోనే అభివృద్ధి సాధ్యం

ఏలూరు శాసనసభ్యులు బడేటి బుజ్జి—-
ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా): విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, రాష్ట్రంలో పేదరికాన్ని పొగొట్టాలనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం విద్యను ప్రొత్సహిస్తుందని ఏలూరు ఎంఎల్‌ఏ బడేటి కోటరామారావు (బుజ్జి) తెలిపారు. స్థానిక పవర్‌పేటలోని ఎంఎల్‌ఏ క్యాంపు కార్యాలయంలో గురువారం అంగన్‌వాడీ కేంద్రం 32లోని 18 మంది చిన్నారులకు, అంగన్‌వాడీ సిబ్బందికి ఎంఎల్‌ఏ యూనిఫాంను పంపిణీ చేసారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. పేదరికాన్ని తొలగించాలని ఉద్దేశ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం విద్యను ఎంతో ప్రొత్సహిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్నిరకాల మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అంతే కాకుండా అంగన్‌వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నా మన్నారు. మూడు కేంద్రాలను కలిపి ఒకేచోట ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో నర్సరీ, ఎల్‌కేజీ, యుకెజిలకు వేరువేరు గదులను కేటాయిస్తున్నామన్నారు. వీటిలో అన్నిరకాల మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అయితే ఇందులోని చిన్నారులకు దాతలు యూనిఫారంను ఇప్పి స్తున్నామన్నారు. పవర్‌పేటలోని అంగన్‌వాడీ కేంద్రం 32లోని చిన్నారులకు తాను యూనిఫారంలను అందించానన్నారు. అదే విధంగా నియోజకవర్గంలోని 120 అంగన్‌వాడీ కేంద్రాలకు దాతల ద్వారా యూనిఫాంలు అందిస్తామని సూచించారు. ఈకార్యక్రమంలో సిడిపిఓ వై జయక్ష్మీ, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ నాయుడు పోతురాజు, మాజీ డిప్యూటీ మేయర్‌ చోడే వెంకటరత్నం, కార్పొరేటర్లు జిజ్జువరపు ప్రతాప్‌, కోరాడ బాలకృష్ణ, టిఎన్‌టియుసి అధ్యక్షులు కోపల్లి ఉమాశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *