ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో తనిఖీలు

ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా): జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని సిబ్బంది రోగుపట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తూ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్సీ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ సూచించారు. స్ధానిక జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని పలు వార్డులను శుక్రవారం ఎమ్మెల్సీ రాము సూర్యారావు, డిసిహెచ్‌ఎస్‌ డా. శంకరరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా. ఏవిఆర్‌ మోహన్‌లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలోని సిబ్బంది ఏవిధంగా విధులు నిర్వర్తిస్తున్నారో, రోగులకు అన్నీ సౌకర్యాలు అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు ప్రతీవారం తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ తనిఖీల్లో డిసిహెచ్‌ఎస్‌, సూపరింటెండెంట్లు పాల్గొని ప్రతీరోగితో మాట్లాడుతున్నారన్నారు. అంతేకాకుండా వారి ఆరోగ్య పరిస్ధితిని పరీక్షిస్తున్నారన్నారు. కొంతమంది బాలింతలు ప్రభుత్వమిచ్చిన కిట్స్‌ను ఉపయోగించకుండా పాత గుడ్డలను వాడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలా చేయడం వలన బిడ్డకు వ్యాధులు సోకే అవకాశం ఉన్నదని ఖచ్చితంగా కిట్స్‌ను వాడాలని అవగాహన కలిగించామన్నారు. సిబ్బంది చక్కగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. రోగులతో మర్యాద పూర్వకంగా నడుచుకుంటున్నారన్నారు. ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసేందుకు సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డా. జగన్నాధరావు, జిల్లా క్వాలిటీ కో ఆర్డినేటర్‌ మనోజ్‌, తదితయి పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *