నంద్యాల, కాకినాడలో టిడిపిదే విజయం

మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
గుంటూరు: నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పోరేషన్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా చిలకూరిపేటలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతి డబ్బుతో దొడ్డిదారిన గెలవాలని ప్రయత్నిస్తున్న జగన్‌ ప్రయత్నాలను ప్రజలే తిరస్కరిస్తున్నారని అన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్‌ చేసిన అరాచకాలు, దోపడీలు ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందని మంత్రి పేర్కొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *