రాహుల్‌ ప్రసంగం.. అన్నీ తప్పులే

బెంగళూరు: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. ఇటీవల బెంగళూరులో ‘ఇందిరా క్యాంటీన్లు’ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే క్యాంటీన్ల విషయమై ఆయన ప్రసంగిస్తూ.. ‘ఇందిరా క్యాంటీన్స్‌’ అనబోయి.. పొరపాటున ‘అమ్మా క్యాంటీన్స్‌’ అనేశారు. ఆ తర్వాత అరగంట పాటు ఇచ్చిన ప్రసంగంలోనూ పలు తప్పు దొర్లిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ప్రసంగంలో.. కర్ణాటకలోని అన్ని నగరాల్లో అనాల్సిందిపోయి.. బెంగళూరులోని ప్రతి ఒక్క నగరం అనేశారు. అంతేకాదు.. క్యాంటీన్లకు బదులు క్యాంపెయిన్లు అనడంతో రాహుల్‌ ప్రసంగంపై నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు. ఇందిరా క్యాంటీన్లలో బుధవారం నుంచి అల్పాహారం రూ.5, భోజనం రూ.10కే అందిస్తున్నారు. 2015 ఏడాది బడ్జెట్‌లోనే ఇందిరా క్యాంటీన్ల నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *