చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసమే

 

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు—-
నంద్యాల: తనకు అండగా ఉన్న ప్రజల కోసం తన సర్వస్వాన్ని ధారబోస్తానని, చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసమే పని చేస్తానని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఉప ఎన్నికల ప్రకటన తర్వాత తొలిసారి నియోజకవర్గంలో రెండు రోజుల ప్రచారం నిమిత్తం వచ్చిన ఆయనకు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అయ్యూరు. రోడ్‌షోలో చంద్రబాబు ప్రసంగిస్తూ.. ‘లాంఛనంగా ఓటేయాని ప్రజల్ని కోరేందుకే ఇక్కడకు వచ్చాను. అత్యధిక మెజార్టీతో భూమా బ్రహ్మానందరెడ్డి గొలుపు ఖాయం. నంద్యాల ఒక చరిత్ర ఉన్న నియోజకవర్గం. ప్రశాంతమైన నియోజకవర్గం. అభివృద్ధిని ఆకాంక్షించే ప్రజలు ఉండే ప్రాంతం. పదేళ్ల పాటు అధికారంలో ఉండి ఏమీ చేయలని వ్యక్తులు ఇప్పుడు అభివృద్ధి చేస్తామంటూ మాటలు చెబుతున్నారు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనతో నంద్యాలలో అభివృద్ధి శూన్యం. వాళ్లకు ప్రజల అభ్యున్నతి అవసరంలేదు. ఓట్లు దండుకొని డబ్బు కూడబెట్టుకుంటారు తప్ప సేవ చేసే ఉద్దేశం వాళ్లకు లేదు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే నంద్యాలలో అభివృద్ధి జరిగింది.
సాగునీటి ప్రాజెక్టులపై ఎనలేని శ్రద్ధ
మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజల వద్దకు పంపి సమస్యలు పరిష్కరిస్తున్నాం. రైతులకు రూ.24 వేల కోట్లు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం మాది. వ్యవసాయ ఖర్చు తగ్గించి రైతు ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఒకప్పుడు జలయజ్ఞం ధనజయ్ఞంలా మారింది. కానీ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ఎనలేని శ్రద్ధ కనబరిచింది. పట్టిసీమను ఏడాది కాలంలోనే పూర్తిచేశాం. ప్రాజెక్టు పూర్తిచేసి రాయసీమను సస్యశ్యామంగా మారుస్తాం. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 5 లక్ష పంట కుంటలు తవ్వి.. చెక్‌ డ్యామ్‌లు నిర్మించాం. డ్వాక్రా సంఘాలు నా మానస పుత్రిక. రాష్ట్రంలో వంట గ్యాస్‌ను అందరికీ అడిగడిగి మరీ ఇస్తున్నాం.’ అని అన్నారు.
స్మార్ట్‌ నంద్యాలగా మారుస్తా
నంద్యాలను స్మార్ట్‌ నంద్యాలగా మారుస్తా. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు అహర్నిశులు పనిచేస్తున్నా. రాష్ట్రమే నా కుటుంబం, పేదలే నా ఆత్మబంధువులుగా అలుపెరగకుండా పనిచేస్తుంటే నన్ను కాల్చి చంపాలంటారా? ఉరివేస్తారా?. బాధ్యతాయుతమైన నేతలు మాట్లాడాల్సిన మాటలు అవేనా. ఓటు ప్రజల చేతిలో ఓ శక్తిమంతమైన ఆయుధం. అది మీ చేతుల్లో ఉంది. కాల్చక్కర్లేదు. ఉరివేయక్కర్లేదు. ఓటుతోనే ఖతం చేయండి. నాకు కోర్కెలు లేవు. రాష్ట్రాన్ని నేను బాగుచేస్తాననే నమ్మకంతోనే ప్రజలు నాకు అధికారం కట్టబెట్టారు. ఎన్నో కష్టాలు ఉన్నాయి. సమస్యలు ఉన్నాయి. వాటిపై పోరాటం చేస్తాం. అనునిత్యం ప్రజల అభ్యున్నతే నా ధ్యాస. నంద్యాలకు మూడు నెలల్లో 285 పనులు మంజూరు చేశాం. నంద్యాలలో రూ. 2200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం అని చంద్రబాబు అన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *