దళితుపట్ల బరితెగించి మాట్లాడారు

మంత్రి ఆదినారాయణరెడ్డిపై రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యదర్శి సతీష్‌బాబు ఆగ్రహం—-
గోపాలపురం, (పశ్చిమ గోదావరి జిల్లా): టిడిపి మంత్రి ఆదినారాయణరెడ్డి బరితెగించి దళితుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదినారాయణరెడ్డిని తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యదర్శి జేష్ఠ సతీష్‌బాబు అన్నారు. స్థానిక రహదారి బంగ్లా వద్ద శనివారం విలేకరులతో మాట్లాడారు. మంత్రి ఆదినారాయణరెడ్డి దళితుల పట్ల అగౌరవంగా బరి తెగించి మాట్లాడినా చంద్రబాబు నాయుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. టిడిపి ప్రభుత్వంలో ఎంత రౌడీయిజం చేస్తే అంతమందిని పార్టీ అందమెక్కిస్తుందన్నారు. దళితులు అన్నా, దళితుల పిల్లల అన్నా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టిడిపి మంత్రులకు పడదని అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రం దళితులు దేవుళ్లు వారి నీడలోనే పార్టీ నడుస్తుందని వారే మాదేవుళ్లు అని స్టేట్‌మెంట్లు ఇచ్చే చంద్రబాబుకు మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని సతీష్‌బాబు ప్రశ్నించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే ఆదినారాయణరెడ్డిని పదవి నుంచి తొలగించి అతనిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసుపెట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తే రాబోయే ఎన్నికల్లో దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. మట్టపర్తి రామ్మోహనరావు, పిట్టా రామారావు, మద్దా సనారీ, దాసరి కుటుంబరావు, మండల కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *