విద్యార్ధులకు ట్యాబ్లు పంపిణి

కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలి: అంబికా కృష్ణ—-
ప్రభుత్వం విద్యను ప్రొత్సహిస్తుంది: ఎంఎల్‌సి రాము సూర్యారావు—-
విద్యార్ధులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలి: యస్‌యంఆర్‌ పెదబాబు—-
ఏలూరు, (పశ్చిమ గోదావరి జిల్లా): విద్యార్ధులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని రాష్ట్ర సినీ టివి అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అంబికా కృష్ణ సూచించారు. స్థానిక 12 పంపుల సెంటర్‌లోని గాంధీ నగర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌లో శనివారం ప్రతిభా పురస్కారం 2016ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2015`16 విద్యా సంవత్సరంలో 10కి 10 జిపిఏ పాయింట్లు సాధించిన 6 గురు పదో తరగతి విద్యార్ధులకు ట్యాబ్లు అందించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్‌ బోరా జ్యోతి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిధిగా పాల్గొన్న అంబికా కృష్ణ మాట్లాడుతూ కష్టపడితేనే లక్ష్యాను సాధించగలమన్నారు. కావున ప్రతీవిద్యార్ధి కష్టపడి చదవాలని ఉపాధ్యాయులు వీరికి క్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలన్నారు. విద్యార్ధువు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. అనంతరం ఎంఎల్‌సి రాము సూర్యారావు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యను ప్రొత్సహిస్తుందని విద్యార్ధులను ప్రొత్సహించేందుకు పదో తరగతిలో 10కి 10 పాయింట్లు సాధించిన విద్యార్ధులకు ట్యాబ్‌ను అందించామన్నారు. ట్యాబ్‌లు పొందిన విద్యార్ధులను మిగిలిన విద్యార్ధులు ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదవాలన్నారు. నగర కోఆప్షన్‌ సభ్యులు యస్‌యంఆర్‌ పెదబాబు మాట్లాడుతూ విద్యార్ధులు మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కు సాధించిన విద్యార్ధులకు బహుమతులు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. కావున పదో తరగతి విద్యార్ధులు కష్టపడి చదివి ఉత్తమ మార్కులు సాధించి తల్లిదండ్రులకు మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్‌ు చోడేవెంకటరత్నం, గుడివాడ రామచంద్రకిశోర్‌ డిప్యూటీ మేయర్‌ నాయుడు పోతురాజు కార్పొరేటర్లు పునుకోల్లు పార్ధసారధి, కోమర్తి వేణుగోపాల్‌, నగరపాలక సంస్థ కమీషనర్‌ వై సాయిశ్రీకాంత్‌, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *