శ్రీ మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకున్న ప్రముఖులు

జంగారెడ్డిగూడెం(పశ్చిమ గోదావరి జిల్లా) : స్వయం భూ శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధం శనివారం నాడు నరసాపురం నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజు మధ్యాహ్నము 3 గంటలకు విచ్చేసారు. వీరికి ఆలయ మర్యాదతో స్వాగతం పలికి, శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారికి వీరిచే తమలపాకుల పూజ గావించి, ఆలయ ముఖ మండపము నందు ఆలయ అర్చకుచే వేద ఆశీర్వచన గావించి, శ్రీ స్వామి వారి శేష వస్త్రములతో సత్కరించి శ్రీ స్వామి వారి ప్రసాదములను ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాధరాజు అందజేశారు.
శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దర్శించుకున్న మంత్రి సతీమణి
స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దర్శనార్ధం దేవాదాయ ధర్మదాయ శాఖా మంత్రి పైడికొండ మాణిక్యాలరావు సతీమణి పైడికొండ సూర్యకుమారి, కుమార్తె సింధు మధ్యాహ్నం 4 గంటలకు విచ్చేసారు. వీరికి ఆలయ మర్యాదతో స్వాగతం పలికి, శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారికి వీరిచే తమలపాకుల పూజ గావించి, ఆలయ ముఖ మండపము నందు ఆలయ అర్చకుచే వేద ఆశీర్వచన గావించి, శ్రీ స్వామి వారి శేష వస్త్రములతో సత్కరించి శ్రీ స్వామి వారి ప్రసాదములను ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాధరాజు అందజేశారు. దేవస్ధానము నందు కళారాధన నివేధన కార్యక్రమంలో భాగాంగా భీమవరం వాస్తవ్యురాలు కె మల్లేశ్వరి భాగావతారిని వారిచే రాయభారము హరికథ ఏర్పాటు చేయడమైంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *