సామాన్యులకు సొంతింటి కల నెరవేెరాల్సిందే

పెట్టుబడులకు అనుకూలం విశాఖ—-
దెబ్బతిన్న రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని అభివృద్ది చేసుకోవాల్సిందే—-
రియల్‌ ఎస్టేట్‌ ఎక్స్‌పో ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వాసుపల్లి—-
విశాఖపట్నం( విశాఖ జిల్లా): సామాన్య , మధ్య తరగతి ప్రజలకు రియల్‌ ఎస్టేట్‌ రంగం చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని, స్మార్ట్‌ సిటీగా అభివృద్ది చెందుతున్న విశాఖ నగరం అన్ని రకాల పెట్టుబడులకు అనుకూలమని అర్బన్‌ టిడీపీ అధ్యక్షుడు దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌ అన్నారు. శనివారం ఉదయం వుడా చిల్డన్స్ర ధియేటర్‌లో హెచ్‌ఆర్‌ మీడియా హౌస్‌ ఏర్పాటు చేసిన రియల్‌ ఎస్టేట్‌ ఎక్స్‌ప్లోకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ రంగం కొంత వెనకబడివుందన్నారు. హూద్‌హుద్‌ తర్వాత కోలుకున్నప్పటికి పెద్ద నోట్లు రద్దు, తాజాగా సిట్‌ విచారణ వంటి అంశాలతో భూముల కొనుగొలు, ప్లాట్లులు, విల్లాలు కొనుగోలు శాతం ఘననీయంగా తగ్గిందన్నారు. దీంతో నగరాభివృద్దిపై దీని ప్రభావం పడిందన్నారు. ఒకసారి వెనకబడితే పెట్టుబడులు వేరే ప్రాంతాలకు తరలిపోయే అవకాశం వుందన్నారు. ప్రస్తుతం అత్యధిక పెట్టుబడులు హైదరాబాద్‌లోనే పెట్టేందుకు అన్ని రకాల వర్గాలు అసక్తి కనబరుస్తున్నాయన్నారు. వినియోగదారులు నుంచి నమ్మకం సంపాందించాలని, ఎన్ని వెంచర్లు వేశామా, ఎంత మేరకు నిర్మాణాలు చేపట్టామా అన్నది ముఖ్యం కాదన్నారు. కార్యక్రమంలో గౌరవ అతిధిగా వైజాగ్‌ జర్నలిస్టు ఫోరం అద్యక్షుడు గంట్ల శ్రీనుబాబు హాజరై మాట్లాడుతూ ఇటువంటి ఎక్స్‌ప్లో వలన నగర ప్రజలకు అన్ని అంశాలు తెలుసుకొనే వెసులు బాటు కలుగుతుందన్నారు. బ్యాంకు సేలు కూడా ఎక్స్‌ప్లోలో అందుబాటులో వుంచడం వలన ప్రజలు తాము కోరుకున్న ఇళ్ళు, ఇళ్ల స్థలాలు సుభతరంగా కొనుగోలుకు అవకాశం కలుగుతుందన్నారు. ఎక్స్‌ప్లో ఏర్పాటు చేసిన హెచ్‌ఆర్‌ మీడియా హౌస్‌ అధినేత బొప్పన రమేష్‌ను ఎమ్మెల్యేతో పాటు అతిధులంతా అభినందించారు. రియల్‌ ఎస్టేట్‌ ఎక్స్‌పోలో సువర్ణభూమి డెవలప్‌ర్స్‌, సువర్ణభూమి ఇన్‌ఫ్రా, సూర్య డెవప్‌ర్స్‌, రాజా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్సు ప్రైవేట్‌ లిమిటెట్‌, లక్ష్మినివాస్‌ హౌసింగ్‌ ప్రాజెక్ట్సు, హసినీ ఎస్టేట్స్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్స్‌, హానీ గ్రూప్‌, ప్రకృతి వెంచ్‌ర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, బిబిజి యువర్‌ వెల్తె, చరణ్‌ గ్రూప్‌ ఫీల్డ్‌గో, ఎస్టేట్స్‌, సాయి సిరి టౌన్‌షిప్స్‌తో పాటు హౌసింగ్‌ రుణాల మంజారు చేసే యుకో బ్యాంకు, సిండికేట్‌ బ్యాంకు ఎక్స్‌పోలో పాల్గోన్నాయి. కార్యక్రమంలో ఎక్స్‌పొ నిర్వహకులు రమేష్‌ బొప్పన , బీశెట్టి అప్పారావు , పి, నారాయణ్‌, గొర్లె జగన్‌మోహన్‌ , ఇరోతి ఈశ్వరావు తదితర్లు పాల్గోన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *