ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట

తీరు మారనున్న తెలుగు తమ్ములు
గోపాలపురం (పశ్చిమ గోదావరి జిల్లా): ఒకే సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తూ మిగిలిన సామాజిక వర్గాలను దూరం చేయాలనుకోవడం పార్టీకి తీరని నష్టం కలుగుతుందని తెలుగు తమ్ములు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావును నిలదీశారు స్థానిక ఎఎంసీ కార్యాలయం వద్ద సోమవారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశం మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్నా ఎమ్మెల్యే ఎదుట తెలుగు తమ్ములు చదలవాడ ప్రసాద్ ఇతర నాయకులు మాట్లాడుతూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులకే పార్టీలో పెద్దపీట వేస్తున్నారని మీరన్న సామాజిక వర్గాల నుండి నాయకులకు సభావేదికపైకి ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. అందువల్ల పార్టీకి నష్టం కలుగుతుందన్నారు గతవారం క్రితం కరిచర్లగుడంలో జరిగిన మండల పార్టీ సమావేశానికి కూడా ఒకే సామాజిక వర్గాన్ని వేదికపైకి పిలవడం వల్ల మిగిలిన కులాల నాయకులు చిన్నబుచ్చుకున్నారని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలని తెలుగు తమ్ముళ్లు ఎమ్మెల్యేకు వివరించారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంటేశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాలుగు మండలాల అధ్యక్షులు ఒకే సామాజిక వర్గం కావడం సభావేదికపైకి మిగిలిన సామాజికవర్గం నాయకులను పిలవలేదన్నారు. మండల స్థాయి సమావేశాల్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందన్నారు అదేవిధంగా మండల స్థాయి నాయకులు విభేదాలు విడనాడి పార్టీ అభివృద్ధికి పాటుపడాలన్నారు వర్గంలో నాయకులు చేస్తున్న తప్పులే తప్ప కార్యకర్తలు కాదన్నారు నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో విభాగాలు వస్తున్నాయన్నారు. గ్రామాల్లో గ్రూపులు ఏర్పాటు చేయడం వల్ల పార్టీకి నష్టం చేసినవారుగా మిగిలిపోతారని అన్నారు. ఎప్పటికైనా స్థానిక నాయకులు ఐక్యంగా ఉంటే రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. ఎఎంసి చైర్మన్ విషయం రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం జరుగుతుందని ఎమ్మెల్యే వివరించారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *