సామాజిక సేవతోనే జీవితం పరమార్థం

విశాఖపట్నం : సమాజంలో ఎంతో కొంత మనవంతు సహాయ సహాకారాలు అందించడం వలన మన జీవితం పరమార్థమవుతుందని స్టార్‌ మేకర్‌ సత్యానంద్‌ అన్నారు. పార్థు వెల్ఫేర్‌ సోసైటీ అధ్వర్యంలో 27వ వార్డు జీవీఎంసీ సామాజిక భవనంలో ఉచిత వైద్య శిబిరంతో పాటు మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సత్యానంద్‌ మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని తలపెట్టాలని కోరారు. వీజేఎఫ్‌ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చిన సొసైటీ సభ్యులను అభినందించారు. జీవీఎంసీ జోనల్‌ కమిషన్‌ ఇటువంటి సామాజిక సేవను ప్రొత్సాహించడం ఆనందాయకమన్నారు. కార్యక్రమంలో జీవీఎంసీ ప్రాజెక్టు డైరెక్టర్‌ మణీ, అసోసియేషన్‌ చైర్మన్‌ పార్థసారధి, ట్రెజరర్‌ సతివాడ శ్రీకాంత్‌, డాక్టర్‌ జగదీష్‌ తదితరులు పాల్గోన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *