ఏపీ ప్రభుత్వానికి చిరంజీవి లేఖ

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రాజ్యసభ ఎంపీ, ప్రముఖ సినీనటుడు చిరంజీవి లేఖ రాశారు. తిరుపతి 18వ వార్డులోని స్కావెంజర్స్‌ కాలనీని ఖాళీ చేయించడాన్ని ప్రశ్నిస్తూ ఆయన లేఖ రాశారు. 70 ఏళ్లుగా నివాసముంటున్న ప్రజల్ని ఖాళీ చేయించటం సరికాదంటూ చిరంజీవి తన లేఖలో పేర్కోన్నారు. తిరుపతి నగరం మధ్యలో ఈ కాలనీ ఉండటం ఇష్టం లేకే మున్సిపల్‌ శాఖ ఈ పని చేస్తోందని ఆయన తన లేఖలో ఆరోపించారు. స్థానికులను ఖాళీ చేయించి ప్రైవేటు వ్యక్తులకు స్థలాన్ని కట్టబెట్టటంపై చిరంజీవి తన లేఖలో ఆక్షేపించారు. తాను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని చిరంజీవి స్పష్టం చేశారు. ప్రభుత్వం బలప్రయోగంతో పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలను, యానాది కుటుంబాలను తరలించాలని చూడటం శోచనీయమని ఆయన తన లేఖలో పేర్కోన్నారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *